Botsa Satyanarayana
ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని తమ పార్టీ నిర్ణయించిందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖలో బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడారు. వర్షాల వల్ల రైతాంగం ఇబ్బందుల పడిందని, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ నెల 13వ తేదీన అన్ని కలక్టరేట్లలో వినతిపత్రాలు అందజేస్తామని తెలిపారు. ఈ నెల 27వ తేదీన విద్యుత్ చార్జీలు పెంపుపై విద్యుత్ కార్యాలయాలలో వినతిపత్రాలు అందజేస్తామని అన్నారు. విద్యుత్ భారాలను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. ఫీజ్ రియంబర్స్ మెంట్ విడుదల చేయాలని జనవరి 3వ తేదీన కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు.
రైతులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని బొత్స అన్నారు. విశాఖలో డ్రగ్స్ వ్యవహారంపై తాను మళ్లీ కేంద్రానికి లేఖ రాస్తున్నానని తెలిపారు. అధికారులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి కి లేఖ రాస్తానని అన్నారు. సిట్ రిపోర్ట్ ను బహిర్గతం చేయాలని లేఖ రాస్తానని చెప్పారు.
Rajya Sabha: బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్య.. టీడీపీ నుంచి ఎవరంటే?