Pawan Kalyan: ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం.. ప‌వ‌న్‌ను ఆలింగన చేసుకున్న బొత్స.. వీడియో వైరల్

ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆలింగనం చేసుకున్నారు.

Botsa Satyanarayana with Pawan Kalyan

AP Assembly Sessions 2024: ఏపీ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం పదోరోజు కొనసాగుతున్నాయి. అయితే, ఇవాళ అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసెంబ్లీ హాల్ నుంచి బయటకు వచ్చి కారెక్కేందుకు వెళ్తుండగా.. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆయనకు ఎదురెళ్లి ఆలింగనం చేసుకున్నారు. అంతకుముందు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, తదితరులు అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ నుంచి వెళ్లిపోయేందుకు పవన్ కల్యాణ్ బయటకు వచ్చారు. పవన్ కల్యాణ్ రావడాన్ని చూసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పలువురు వైసీపీ ఎమ్మెల్సీలు అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోయారు.

Also Read: పీఏసీ ఛైర్మన్‌ పోస్ట్.. వైసీపీ వేసిన స్కెచ్‌ ఏంటి? కూటమి రివర్స్ ప్లానింగ్ ఏంటి?

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాత్రం అక్కడే ఉండి పవన్ కల్యాణ్ కు నమస్కారం చెప్పారు. బొత్స సత్యనారాయణ నమస్కారం చేయడాన్ని గమనించిన పవన్ కళ్యాణ్ ప్రతినమస్కారం చేశారు. తనకు ఎదురుగా బొత్స రావడాన్ని గమనించిన పవన్ కల్యాణ్ .. తాను ముందుకెళ్లాడు. దీంతో బొత్స పవన్ కల్యాణ్ వద్దకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ క్రమంలో ఇద్దరు ఒకొరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.