పీఏసీ ఛైర్మన్ పోస్ట్.. వైసీపీ వేసిన స్కెచ్ ఏంటి? కూటమి రివర్స్ ప్లానింగ్ ఏంటి?
తన సామాజిక వర్గానికి పదవులు ఇచ్చుకునేందుకు జగన్ తహతహ లాడుతున్నారని కార్నర్ చేస్తోంది.

Gossip Garage PAC Chairman Post (Photo Credit : Google)
Gossip Garage : ప్రతిపక్ష హోదా రాలేదు. ఎంత పట్టుబట్టినా పబ్లిక్ అకౌంట్స్ ఛైర్మన్ పదవి కూడా వచ్చేలా కనిపించడం లేదు. మీరెన్ని మాటలు మాట్లాడినా..ఎంత వాదించినా ప్రజలే మిమ్మల్ని తిరస్కరించారు. మేముందుకు మిమ్మల్ని గుర్తించాలంటోంది కూటమి ప్రభుత్వం. ఇక మీకు హోదా దక్కడం కలే. బద్నాం చేసేందుకే మీరు ప్లాన్ చేయొచ్చు. కానీ ఓ పద్దతంటూ ఫాలో కావాల్సిందేనంటోంది కూటమి సర్కార్. పీఏసీ ఛైర్మన్ పదవి విషయంలో బిగ్ ట్విస్ట్ ఇచ్చింది ప్రభుత్వం. దీంతో ఏదో చేద్దామనుకుంటే ఏదో అయిపోయిందని కంగుతిన్న ఫ్యాన్ పార్టీ లీడర్లు డైలమాలో పడిపోయారట. ఇంతకీ పీఏసీ విషయంలో ఏం జరిగింది.? వైసీపీ వేసిన స్కెచ్ ఏంటి.? కూటమి సర్కార్ ప్లాన్ సక్సెస్ ఫుల్‌గా వర్కౌట్ కాబోతుందా.?
వైసీపీకి ఇంకో షాక్..
మరో కీలక పోస్ట్ విషయంలో ట్విస్ట్ ఇచ్చింది కూటమి సర్కార్. ఇప్పటికే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని గగ్గోలు పెడుతోన్న వైసీపీకి ఇంకో షాక్ ఇచ్చింది. పబ్లిక్ అకౌంట్స్ ఛైర్మన్ పదవి కోసం ఫ్యాన్ పార్టీ అభ్యర్థిని పెట్టగా..అంత సీన్ లేదు. మీకెలా పీఏసీ పదవి వస్తుందంటూ ఝలక్ ఇచ్చింది. ఏకంగా చరిత్రలో ఎప్పుడూ లేనట్లుగా పీఏసీ ఎన్నికలకు దారి తీసింది. పీఏసీ చైర్మన్ పదవికి వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేశారు. దీంతో పీఏసీ ఛైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందనేది హాట్ టాపిక్ అయింది. ఇంతలోనే మంత్రి పయ్యావుల హింట్ ఇచ్చి ఝలక్ ఇచ్చారు. అసెంబ్లీలో వైసీపీకి బలం లేదు..ఆ పార్టీకి కేవలం 11మంది సభ్యులు మాత్రమే ఉన్నారని చెప్పారు. 20మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంటేనే పీఏసీ మెంబర్ అవుతారంటూ చెప్పుకొచ్చారు. దీంతో వైసీపీ వేసిన ప్లాన్ ఒకటి అయితే..సీన్ ఇంకో దిక్కు టర్న్ తీసుకుంది.
చరిత్రలో ఎప్పుడూ లేనట్లుగా…
పీఏసీ ఛైర్మన్ పోస్ట్‌ను మామూలుగా అయితే ఏ పార్టీ పవర్‌లో ఉన్నా అపోజిషన్‌కు ఈ పదవి ఇస్తుంటారు. పీఏసీ ఛైర్మన్ పోస్ట్‌కు క్యాబినెట్ ర్యాంకు హోదా ఉంటుంది. ప్రభుత్వ పద్దులన్నీ పీఏసీ నుంచే వెళ్తాయి. ప్రభుత్వం పద్దులు ఏవైనా పీఏసీ పరిశీలనకు వెళ్లాల్సిందే. అలా ప్రభుత్వం వన్ సైడ్ డెసిషన్స్ తీసుకోకుండా..పీఏసీ పోస్ట్ అపోజిషన్‌కు ఇచ్చే ప్రక్రియ ఎప్పటి నుంచో కొనసాగుతోంది. అయితే చరిత్రలో ఎప్పుడూ లేనట్లుగా ఇప్పుడు పీఏసీ ఛైర్మన్ పోస్ట్ ఇష్యూ హాట్ టాపిక్ అయిపోయింది. వైసీపీకి తగినంత మెజార్టీ లేకపోవడమే ఇందుకు కారణం.
బలం లేకుండానే పీఏసీ ఛైర్మన్ పదవికి వైసీపీ నామినేషన్..
అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ సభ్యుడికి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వటం ఆనవాయితీగా వస్తోంది. కానీ పీఏసీలో సభ్యుడిగా ఎన్నిక కావాలంటే..కనీసం 20 మంది ఎమ్మెల్యేల బలం అవసరం ఉంటుంది. వైసీపీకి కేవలం 11మంది మాత్రమే ఉన్నారు. బలం లేకుండానే పీఏసీ ఛైర్మన్ పదవికి వైసీపీ నామినేషన్ వేయడం చర్చనీయాంశంగా మారింది. పీఏసీ కమిటీలో శాసనసభ నుంచి 9మంది సభ్యులు ఉంటారు. ప్రతీసారి పీఏసీ సభ్యుల ఎన్నిక నామినేటెడ్ ప్రాసెస్‌లో అయిపోతుంటుంది. కానీ ఫస్ట్ టైమ్ ఈసారి ఎన్నికలకు దారి తీసింది. టీడీపీ నుంచి ఏడుగురు, జనసేన, బీజేపీ, వైసీపీ నుంచి ఒక్కొక్కరి చొప్పున పీఏసీ మెంబర్ కోసం నామినేషన్ వేశారు.
వైసీపీ నుంచి నామినేషన్ వేసిన పెద్దిరెడ్డి ఓడిపోవడం ఖాయం..!
9 పోస్టులకు పది మంది నామినేషన్ వేయడంతో పాటు..వైసీపీ అభ్యర్థికి అవసరమైన బలం లేకున్నా బరిలోకి దిగడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో పీఏసీ సభ్యులను ఎన్నుకునేందుకు..ఎమ్మెల్యేలంతా అందుబాటులో ఉండాలని కూటమి పార్టీలు తమ ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చింది. ఓటింగ్ ద్వారా పీఏసీ మెంబర్లను ఎన్నుకుంటే వైసీపీ నుంచి నామినేషన్ వేసిన పెద్దిరెడ్డి ఓడిపోవడం ఖాయం. పీఏసీ మెంబరే కాకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీఏసీ ఛైర్మన్ కూడా కాలేరు. దీంతో జనసేన పార్టీకి చెందిన పులివర్తి ఆంజనేయులును పీఏసీ ఛైర్మన్‌ను చేయాలని కూటమి పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలన్న వైసీపీ ప్లాన్ కూడా రివర్స్..
ఇప్పటికే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని వైసీపీ అసెంబ్లీకి వెళ్లడం లేదు. 11మంది ఎమ్మెల్యేలు ఉంటే అపోజిషన్ హోదా ఇవ్వడం ఎలా సాధ్యమని కూటమి పెద్దలు ప్రశ్నిస్తుంటే 40 శాతం ఓటింగ్ వచ్చిందని ఫ్యాన్ పార్టీ వాదిస్తోంది. ఇప్పుడు పీఏసీ ఛైర్మన్ పోస్ట్ వస్తే ప్రభుత్వ పద్దుల పరిశీలనతో కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలన్న వైసీపీ ప్లాన్ కూడా రివర్స్ అయింది. దీంతో మరోసారి అపోజిషన్ వర్సెస్ అధికార కూటమి మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది.
తన సామాజిక వర్గానికి పదవులు ఇచ్చుకునేందుకు జగన్ తహతహ..!
అయితే పీఏసీ పదవి రాదని తెలిసి కూడా వైసీపీ అభ్యర్థిని పెట్టిందంటోంది టీడీపీ. తన సామాజిక వర్గానికి పదవులు ఇచ్చుకునేందుకు జగన్ తహతహ లాడుతున్నారని కార్నర్ చేస్తోంది. 2014లో పీఏసీ చైర్మన్‌గా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించినందుకు.. జ్యోతుల నెహ్రూ పార్టీకి దూరమవ్వడం మార్చిపోయారా అంటూ పాత విషయాలు గుర్తు చేస్తోంది. కూలం చూడం, మతం చూడం..నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని చెప్పి..మళ్ళీ పెద్దిరెడ్డిని పీఏసీ ఛైర్మన్ కోసం పంపారని విమర్శిస్తోంది. శాననమండలిలో కూడా ముందు లేళ్ళ అప్పిరెడ్డిని ప్రతిపక్ష నాయకుడిగా ప్రకటించి..బొత్స సత్యనారాయణ పార్టీ మారుతున్నారని తెలిసి..రివర్స్ గేర్ వేశారంటూ ఎద్దేవా చేస్తోంది. ఇప్పుడు పీఏసీ ఛైర్మన్ విషయంలోనూ వైసీపీ ఏదో చేయబోయి బొక్క బోర్లా పడిందంటోంది కూటమి.
Also Read : మూడు నాలుగు రోజుల్లో బ్లాస్టింగ్ న్యూస్ రాబోతుందా? వైసీపీ కీలక నేతలను వెంటాడుతున్న అరెస్టుల టెన్షన్..