Botsa Satyanarayana : మేం సన్నాసులమైతే.. నువ్వు రుషిపుంగవుడివా..?

రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వైసీపీ నేతలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. బొత్స, పవన్ కళ్యాణ్ వాడిన పదజాలాన్ని తప్పుపట్టారు.

Boscha Satyanarayana

Botsa Satyanarayana: రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వైసీపీ నేతలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ పవన్ కళ్యాణ్ వాడిన పదజాలాన్ని తప్పుపట్టారు. తమని సన్నాసులను సంబోదించాడు పవన్ కళ్యాణ్ ఏమైనా ఋషిపుంగవుడా అంటూ బొత్స వ్యాఖ్యానించారు. మాట్లాడే సమయంలో నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు.

సినిమా టికెట్లను ఆన్ లైన్ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సినీ ప్రముఖులు సుముఖత వ్యక్తం చేశారని, తాజాగా పేర్ని నానితో జరిగిన భేటీలో వారు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారని తెలిపారు. అవేవి తెలియకుండా పవన్ కళ్యాణ్ అవివేకంగా మాట్లాడారని మండిపడ్డారు బొత్స. భారత దేశం కమ్యూనిస్టు రాజ్యం కాదని ఇక్కడ ఎవరైనా వ్యాపారాలు చేసుకోవచ్చని, కానీ ఆ వ్యాపారం ప్రజలను దోచుకునేది అయితే ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాలకు ఆ దోపిడీని అరికట్టే అధికారం ఉందని తెలిపారు.

Read More : Mohan Babu : చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్.. సంతోషమే..

సినిమా టికెట్స్ ఆన్ లైన్ చేయడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని తెలిపారు. ఒకటి ప్రజలను దోపిడీ నుంచి రక్షించడం కాగా.. మరొకటి సరైన లెక్క తెలియడానికని వివరించారు. సినిమా టికెట్ల అమ్మకాల్లో అవకతవలను అరికట్టేందుకు ఈ పద్దతి తీసుకొచ్చినట్లు వివరించారు. 100 టికెట్లు అమ్మి.. 50 అమ్మినట్లుగా లెక్కలు చూపిస్తే ఇక మీదట కుదరదని, ప్రతి టికెట్ కౌంట్ అవుతుందని తెలిపారు.

సామాన్య ప్రజలు కాలక్షేపానికి సినిమాకు వెళ్తే వందలకు వందలు టికెట్ల రూపంలో వసూలు చేసి వారిని ఆర్ధికంగా దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఆనందం కోసం సినిమాకొస్తే ఆర్ధిక దోపిడీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇటువంటి దోపిడీలను సరికట్టి సరైన లెక్కలు తేల్చేందుకే టికెట్లు ఆన్ లైన్ విధానం తీసుకొస్తున్నామని తెలిపారు. నోరుందని పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఊరుకునేది లేదని ధ్వజమెత్తారు.

Read More : Perni Nani : నిర్మాతలకు ఏపీలోనే ఎక్కువ షేర్‌.. కేసీఆర్‌ని తిట్టే ధైర్యం పవన్‌కు లేదు