Perni Nani : నిర్మాతలకు ఏపీలోనే ఎక్కువ షేర్.. కేసీఆర్‌ని తిట్టే ధైర్యం పవన్‌కు లేదు
రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ జనసేనాని పవన్ కళ్యాణ్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వంపై పవన్ తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ రిపబ్లిక్ అని

Perni Nani Vs Pawan Kalyan
ఏపీలో 8వందల థియేటర్లు తెరిచే ఉన్నాయి
నేను సన్నాసి అయితే… పవన్ సన్నాసిన్నర
మనం మనం కాపువాళ్లం.. ఎన్నైనా తిట్టుకుంటాం.. ఏమంటావ్రా పీకే
కేసీఆర్‌ను తిట్టే దమ్ములేక జగన్‌ను తిడుతున్నావ్
రిపబ్లిక్ ఇండియా కాబట్టే పిచ్చవాగుడు వాగుతున్నావ్
కోడి కత్తి కేసు NIA పరిధిలో ఉంది
పదేళ్లలో ఎన్ని హిట్లు కొట్టావ్..!
బుడ్డ హీరోల కలెక్షన్లలో 60శాతం కూడా రావు నీకు
నీకు తిక్క లేదు.. మొత్తం లెక్కే!
పీకే.. నువ్ గుండెలు తీసిన బంటువురా..!
Perni Nani Vs Pawan Kalyan : రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ జనసేనాని పవన్ కళ్యాణ్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వంపై పవన్ తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ రిపబ్లిక్ అని మాట్లాడితే జనం బయటకు లాక్కొచ్చి కొడతారు. అధికారం ఉంది కదా అని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే భవిష్యత్తు లేకుండా పోతారు. అధికారంలో ఉన్న వారు ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండాలి అని పవన్ హెచ్చరించారు.
పవన్ చేసిన విమర్శలకు ఏపీ మంత్రులు అంతే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు. మంత్రులు వరుసగా పవన్ పై ఎదురుదాడికి దిగారు. తాజాగా మంత్రి పేర్ని నాని పవన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. పవన్ మాటలు జగన్ మీద విషం చిమ్మేలా ఉన్నాయన్నారు. సినీ నిర్మాతలకు ఏపీలోనే ఎక్కువ షేర్ వస్తుందని చెప్పారు.
Lock Facebook: ఫేస్బుక్ ప్రొఫైల్‌ను లాక్ చేసుకోవడం ఎలా?
ఏపీలో 1100 థియేటర్ల ఉంటే 800 థియేటర్లలో సినిమాలు ఆడుతున్నాయని పేర్ని నాని తెలిపారు. తెలంగాణలో 519 థియేటర్లు ఉంటే 413 మాత్రమే నడుస్తున్నాయన్నారు. లవ్ స్టోరీ సినిమాకు ఏపీలోనే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయన్నారు. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ సునీల్ నారాయణకి వచ్చిన షేర్ 3.80 లక్షలు.. తెలంగాణలో 3 కోట్లు వచ్చిందన్నారు. సునీల్ నారాయణ బయటకి వచ్చి చెప్పండి.. మీ సినిమాని ఏమైనా ఇబ్బంది పెట్టమా..? అని మంత్రి అడిగారు. సినీ పరిశ్రమను ఏ విధంగా ఇబ్బంది పెట్టామో చెప్పాలని పవన్ ను డిమాండ్ చేశారు. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కుదరదని చెప్పారు.
Google Incognito Mode: ఇన్‌కాగ్నిటో మోడ్‌లో బ్రౌజింగ్‌లోనూ డేటా లీక్!!
తెలంగాణ సీఎం కేసీఆర్ ను తిట్టే దమ్ము, ధైర్యం పవన్ కు లేదన్నారు మంత్రి పేర్ని నాని. సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ ని కవర్ చేస్తే మీడియా చేసిన తప్పు ఏంటి? అని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన FIR ఆధారంగా మీడియా వార్తలు ఇచ్చిందన్నారు. సాయితేజ్ ప్రమాదం గురించి పోలీసులు చెప్పిందే మీడియా చెప్పిందన్నారు. దీనిపై పవన్ తెలంగాణ పోలీసులను ప్రశ్నించాలని సూచించారు. సాయిధరమ్ తేజ్ పవన్ లా కాదు మంచి కుర్రాడు అని చెప్పారు. పవన్ ఏమైనా అనాలి అంటే కేసీఆర్ ని, తెలంగాణ పోలీసుల్ని తిట్టు అని మంత్రి అన్నారు. కేసీఆర్ ని తిట్టే దమ్ము ధైర్యం లేక.. జగన్ పై పడి ఏడుస్తున్నావ్ అని పవన్ పై మండిపడ్డారు. రిపబ్లిక్ ఇండియా కనుకే పిచ్చ వాగుడు వాగుతున్నావ్ అని మండిపడ్డారు. కోడి కత్తి కేసు NIA పరిధిలో ఉందని, దమ్ముంటే వెళ్లి అమిత్ షాని అడగాలని పవన్ ను ఉద్దేశించి మంత్రి అన్నారు. 10 కోట్లలో 45 శాతం ట్యాక్స్ ఎందుకు వేస్తున్నారని కేంద్రాన్ని అడగాలన్నారు. నేను డ్యాన్సులు వేసి సంపాదిస్తున్నా, మీకు ట్యాక్స్ ఎందుకు కట్టాలని అడుగు అని పవన్ ను ఉద్దేశించి అన్నారు.
పవన్ కళ్యాణ్ తపన అంతా మా ఎన్నికల కోసమే అని మంత్రి చెప్పారు. కాపు కులం అంటే నమ్మకంగా ఉండటం అన్న మంత్రి, వైస్సార్ కుటుంబానికి నమ్మకంగా ఉన్నానని చెప్పారు. వకీల్ సాబ్ సినిమాకి మొత్తం 80 కోట్లు వస్తే.. ఏపీలో నిర్మాత షేర్ దిల్ రాజుకి 55 కోట్ల 65 లక్షకు వచ్చిందన్నారు. సినిమా ఆపేస్తే ఇంత డబ్బులు ఎలా వస్తాయని మంత్రి పేర్నినాని ప్రశ్నించారు.