Botsa Slams Chandrababu
Botsa Slams Chandrababu : దేశంలో ఎక్కడా జరగని విధంగా ఏపీలో ఎన్నికల విధానం ప్రకటించి అమలు చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో-ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ అన్నారు. వైఎస్ స్ఫూర్తితో ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. పార్టీని బలోపేతం చేయాలని వైసీపీఎల్పీలో నిర్ణయించామన్నారు.
పార్టీ కార్యక్రమాల్లో మహిళలు పాల్గొనాలని మంత్రి బొత్స సూచించారు. పార్టీ గుర్తుతో గెలిచిన మహిళలు పార్టీ కార్యక్రమంలో పాల్గొనకపోతే ఎలా? అని ప్రశ్నించారు. యాక్టివ్ గా పని చేయడం ఇష్టం లేకపోతే కొత్త మహిళలకు చోటివ్వాలని మంత్రి బొత్స అన్నారు. మనుషులన్నాక చిన్న చిన్న అభిప్రాయభేదాలు ఉంటాయని, అది సహజం అని అన్నారు. ద్వితియ స్థాయి నేతలను పైవారు, ఎమ్మెల్యేలు తొక్కే ప్రయత్నం చేయొద్దని మంత్రి బొత్స అన్నారు. ఎవరైనా తొక్కే ప్రయత్నం చేస్తే తిరగబడాలన్నారు.(Botsa Slams Chandrababu)
YCP sajjala : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బంధం కొనసాగుతూనే ఉంటుంది-సజ్జల
చంద్రబాబు వంటి వ్యక్తులు కుట్రలు పన్నుతున్నారని, పేదలకు పథకాలు ఇవ్వకుండా దోచుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. మనకు గౌరవం ఉండాలంటే అధికారంలో ఉండాలని మంత్రి బొత్స అన్నారు. రాష్ట్ర ప్రజల కోసం మనం అధికారంలోకి రావాలన్నారు. టీడీపీ నేతలు దారుణంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వారి విమర్శలను తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
Botsa Satyanarayana Slams Chandrababu Naidu
సచివాలయాలో సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే చేస్తున్నాయని మంత్రి బొత్స తెలిపారు. గ్రామాల్లో అన్నీ కార్యకర్తల చేతులమీదగానే చేస్తున్నాం అన్నారు. ఏమైనా తేడా ఉంటే.. మీ ఎంపీటీలు, ఎంపీపీలను ప్రశ్నించాలన్నారు. కార్యకర్తలు కొందరు అర్హులకు పథకాలు ఇవ్వొద్దనడం తప్పు అని మంత్రి బొత్స అన్నారు. సీఎం జగన్ ఏమీ అమాయకుడు కాదన్న బొత్స.. అసంతృప్తులను ఎలా అణచాలో ఆయనకు తెలుసన్నారు. ఆయన సోర్స్ ఆయనకు ఉందన్నారు. సమస్యలు ఉంటే చెప్పాలన్న మంత్రి బొత్స.. మీ నియోజకవర్గంలోకి వచ్చే మాట్లాడుతా అన్నారు.
Chandrababu : పొత్తులపై చంద్రబాబు కొత్త మాట
సంక్షేమ పథకాలు సామాన్యుడి హక్కు అని మంత్రి బొత్స తేల్చి చెప్పారు. సంక్షేమ పథకాలపై టీడీపీ విమర్శలేంటి? అని ధ్వజమెత్తారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటున్న టీడీపీ నేతలపై ఆయన ఫైర్ అయ్యారు. వారికి తెలుసో లేదో వాట్సాప్ లో ఫొటోలు తీసిన 80మంది టీచర్లను సస్పెండ్ చేశామన్నారు. ఈ విధంగా ఎప్పుడైనా టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుందా? అని బొత్స నిలదీశారు. టీడీపీకి చెందిన నారాయణ స్కూల్స్ వాళ్లే తప్పు చేస్తే మేము అరెస్ట్ చేశామన్నారు. మీరెందుకు తప్పు పట్టలేదని మంత్రి బొత్స అడిగారు.
Pawan Kalyan Slams Government : వైసీపీ మళ్లీ వస్తే అంధకారమే-పవన్ కళ్యాణ్
జగన్ ఆశయాలకు తూట్లు పొడిచేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు వ్యవహరించవద్దని బొత్స హితవు పలికారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 11 నుండి సీఎం జగన్ సూచన మేరకు గడప గడపకి వైసీపీ కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున సంక్షేమ పథకాలను గడప గడపకు వెళ్లి ప్రజలకు గుర్తు చేసేలా శ్రేణులు సన్నద్ధం కావాలని బొత్స పిలుపునిచ్చారు.