B.Tech Ravi : టీడీపీలోకి కడప జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు : బీటెక్ రవి

టీడీపీ నేత బీటెక్ రవి చేసిన పోస్ట్ ఏపీ రాజకీయాల్ని హీటెక్కిస్తోంది. కడప జిల్లా నుంచి ముగ్గురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అంటూ చేసిన పోస్ట్ సంచలనంగా మారింది.

B.Tech Ravi : టీడీపీలోకి కడప జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు : బీటెక్ రవి

B.Tech Ravi post : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇన్‌చార్జ్‌లను మార్చటం..దానిపై టీడీపీ నేతల సెటైర్లు ఇలా రోజు రోజుకు పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఇదిలా ఉంటే టీడీపీ నేత బీటెక్ రవి చేసిన పోస్ట్ మరింత హీటెక్కిస్తోంది. త్వరలోనే కడప జిల్లా నుంచి ముగ్గురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అవుతున్నారా..? అంటూ క్వశ్చన్ మార్కుతో పోస్ట్ చేశారు.

త్వరలోనే టీడీపీలోకి ముగ్గురు కడప జిల్లా ఎమ్మెల్యేలు.. అని పేర్కొంటునే రెండో లైన్‌లో .. కడప జిల్లాలో ముగ్గురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ కావటానికి సిద్ధంగా ఉన్నారా..? అని క్వశ్చన్ మార్క్ పెట్టారు. తమ చేరికపై సమాచారాన్ని టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలియజేయనున్నారా..? అంటూ మరో క్వశ్చన్ మార్క్ పెట్టి పోస్ట్ చేయటంతో ఈ పోస్ట్ ఏపీని హీటెక్కిస్తోంది. మరీ ముఖ్యంగా కడప జిల్లాలో సంచలనంగా మారింది.

AP Politics : అభ్యర్ధుల్ని కాదు కదా.. పార్టీ అధ్యక్షుడిని మార్చినా వైసీపీ గెలుపు అసాధ్యం : టీడీపీ నేతల సెటైర్లు

అలాగే బీటెక్ రవి అరెస్ట్‌కు ఈ జంపింగ్ కారణమా..?అనే సందేహాన్ని కూడా వెలిబుచ్చారు. ఇంతకీ టీడీపీలోకి జంప్ కానున్న ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరు..? త్వరలోనే జంపింగ్ సీక్రెట్ వీడనుందా..? అంటూ బీటెక్ రవి చేసిన ఈ పోస్ట్ సంచలనం కలిగిస్తోంది.