AP Politics : అభ్యర్ధుల్ని కాదు కదా.. పార్టీ అధ్యక్షుడిని మార్చినా వైసీపీ గెలుపు అసాధ్యం : టీడీపీ నేతల సెటైర్లు

జగన్ ఇన్ చార్జ్ లను మార్చటంపై టీడీపీ నేతలు ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేస్తున్నారు. అసెంబ్లీ ఇన్ చార్జ్ లను కాదు కదా..స్వయంగా ఆ పార్టీ అధ్యక్షుడినే మార్చినా వైసీపీ ఈ ఎన్నికల్లో గెలవటం అసాధ్యం అంటూ టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.

AP Politics : అభ్యర్ధుల్ని కాదు కదా.. పార్టీ అధ్యక్షుడిని మార్చినా వైసీపీ గెలుపు అసాధ్యం : టీడీపీ నేతల సెటైర్లు

TDP Leaders Satires on YCP

TDP Leaders Satires on YCP : సిట్టింగ్ ఎమ్మెల్యేలతో మరోసారి ఎన్నికల బరిలోకి వెళితే ఓటమి ఖాయమని వైసీపీ అధినేత జగన్ భావించారా..? దీని కోసం ఇప్పటినుంచే కసరత్తులు చేస్తున్నారా..? అందుకే అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జ్‌లను మారుస్తున్నారా..? దీని కోసం చర్యలు తీసుకునే క్రమంలో జగన్ త్వరపడుతున్నారా..? అంటే నిజమనేలా జగన్ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే 11మంది ఇంఛార్జ్ లను ప్రకటించిన వైసీపీ.. మొత్తం 62 చోట్ల ఇంఛార్జ్ లను మార్చనున్నట్లు తెలుస్తోంది. ఇక, 30మందికిపైగా సిట్టింగ్ లకు ఈసారి టికెట్లు నిరాకరించే పరిస్థితి కనిపిస్తోంది. కొంతమందిని పార్లమెంటు నుంచి పోటీ చేయించే యోచనలో జగన్ ఉన్నట్లు సమాచారం. గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఇచ్చేలా..ఓడిపోతారు అనే కాస్త అనుమానం ఉన్నా..వారిని ఏమాత్రం ఆలోచించకుండా పక్కన పెట్టేస్తున్నారు. జగన్ తీసుకునే నిర్ణయాలతో పలువురు నేతలు ఉలిక్కిపడతున్నారు. ఈ సారి సీటు దక్కుతుందా..? లేదా అనే ఆందోళన చెందుతున్నారు. కానీ ఎవరు ఏమనుకున్నాను తాను అనుకున్నదే చేస్తున్నారు.

జగన్ ఇన్ చార్జ్ లను మార్చటంపై టీడీపీ నేతలు ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేస్తున్నారు. అసెంబ్లీ ఇన్ చార్జ్ లను కాదు కదా..స్వయంగా ఆ పార్టీ అధ్యక్షుడినే మార్చినా వైసీపీ ఈ ఎన్నికల్లో గెలవటం అసాధ్యం అంటూ టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. వైసీపీకి ఉన్నది ఇంకా మూడు నెలలే అంటూ టీడీపీ నేత, అచ్చెన్నాయుడు ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు.

అలాగే..దూళిపాళ్ల నరేంద్ర కూడా ట్విట్టర్ వేదికగా స్పందిస్తు..వైసీపీ ప్రభుత్వాన్ని మార్చాలని ప్రజలు డిసైడ్ అయ్యారని ఇక మీరు ఎంతమందిని మార్చినా ఫలితం సున్నా..అంటూ ఎద్దేవా చేశారు ప్రజా వ్యతిరేక ఉందని అభ్యర్ధుల్ని మార్చుకంటు పోతే..పులివెందులలో సహా మొత్తం 151మందిని మార్చాల్సిందే అంటూ ఎద్దేవా చేశారు.

ఇక మరో టీడీపీ నేత గోరట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతు..ఎప్పెడెప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలా..? అని ప్రజలు ఎదురు చూస్తున్నారని..అందుకే జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే పనిలో పడ్డారని విమర్శించారు. అసలు ఎమ్మెల్యేల పనితీరు కంటే సీఎం పనితీరుమీదనే జనాలు వ్యతిరేకిస్తున్నారని..అతని అహంకారానికి చరమగీతం పాడేందుకు ప్రజలు ఎన్నికల కోసం ఓదురు చూస్తున్నారని విమర్శించారు. నియంత సీఎం తమకు అక్కర్లేదని తమ ఓట్లతో తీర్పు ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.