Bull Attack
Bull Attack : మదమెక్కిన ఆంబోతు దెబ్బకు కాకినాడ జిల్లా తుని వాసులు హడలిపోయారు. రోడ్లపైకి వచ్చే ధైర్యం కూడా చేయలేక పోతున్నారు. తునిలో ఆంబోతు నానా హంగామా సృష్టించింది. ఇళ్ల సందుల్లోకి చొరబడ్డ ఆంబోతు.. తొలుత సైలంట్‌గానే ఉంది. ఆ తర్వాత రెచ్చిపోయింది. ఆంబోతే కదా అని.. ధైర్యం చేసి రోడ్లపైకి వచ్చిన వారిపై విరుచుకు పడింది. కనిపించిన వారిని కనిపించినట్లే కుమ్మేసింది.
రోడ్లపై పరిగెడుతూ పాదచారులు, ద్విచక్ర వాహనాలపై ఆంబోతు దాడి చేసింది. ఇప్పటి వరకు 10మందికి గాయపడ్డారు. వారిలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆంబోతు దాడిలో తీవ్రంగా గాయపడ్డ వారిని తుని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చాలా మందికి తలలు పగలడంతో.. వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
ఆంబోతు గురించి సమాచారం అందుకున్న పశుసంవర్ధక, పురపాలక శాఖ అధికారులు, పోలీసులు దానిని బంధించేందుకు విఫలయత్నం చేశారు. చివరకు మత్తు మందు ఇచ్చి బంధించేందుకు ప్రయత్నించినా.. అది తప్పించుకు పారిపోయింది.
Also Read :Karnataka : ప్రియురాలి తల నరికి,తలతో పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయిన వ్యక్తి