Karnataka : ప్రియురాలి తల నరికి,తలతో పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయిన వ్యక్తి
ప్రియురాలిని ఇచ్చి పెళ్లి చేయలేదనే కోపంతో ఒక వ్యక్తి ఆమె తల నరికి పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.

Murder
Karnataka : పగ ప్రతీకారాలతో రగిలిపోయే మనుషులు, ఆవేశంలో చేసే పనులు ఒళ్లు గగుర్పాటు కలిగిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం భార్య ప్రవర్తనపై అనుమానం ఉన్న ఒడిషాకు చెందిన భర్త, భార్య తల నరికి, తలతో పోలీసు స్టేషన్ కు వెళ్లిలొంగిపోయిన ఘటన మరువకు ముందే ప్రియురాలిని ఇచ్చి పెళ్లి చేయలేదనే కోపంతో ఒక వ్యక్తి ఆమె తల నరికి పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.
కర్ణాటకలోని విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా కన్నబొరనయ్యన హట్టికి చెందిన భోజరాజ్ అనే వ్యక్తి ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అతను అదే గ్రామానికి చెందిన తమ సమీప బంధువు బసణ్ణ కుమార్తె నిర్మల(23) అనే బీఎస్సీ నర్సింగ్ విద్యార్ధినిని ప్రేమించాడు. ఒకసారి వారి ఇంటికి వెళ్లి నిర్మలను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.
అందుకు బసణ్ణ కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. నిర్మల కూడా తల్లి తండ్రుల మాట కాదనలేదు. కాగా…. రెండు నెలల క్రితం భోజరాజ్ కు మరో యువతితో వివాహాం అయ్యింది. కలబురిగిలో చదువుతున్న నిర్మల ఇటీవల స్వగ్రామానికి వచ్చింది. గురువారం మధ్యాహ్నం… బసణ్ణ ఇంట్లో ఎవరూలేరని…నిర్మల ఒక్కతే ఇంట్లో ఉందని తెలుసుకున్న భోజరాజ్ వారింటికి వెళ్ళాడు. అక్కడ నిర్మలతో గొడవ పడ్డాడు. తనతో తీసుకు వెళ్లిన కత్తితో ఆమె తల నరికి హత్య చేశాడు. తలను మొండెం నుంచి వేరు చేసి తన వద్ద ఉన్న సంచిలో పెట్టుకుని బైక్ పై పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.
Also Read : One Nation-One Election : జమిలి ఎన్నికలపై తేల్చి చెప్పిన కేంద్రం