18న ఏపీ క్యాబినెట్ సమావేశం, 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు?

ఈ నెల 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండే అవకాశం ఉంది.

Ap Cabinet Meeting : ఈ నెల 18న ఏపీ క్యాబినెట్ సమావేశం కానుంది. ఈ నెల 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండే అవకాశం ఉంది. ఇవాళ రాత్రికి లేదా రేపు మంత్రులకు శాఖల కేటాయింపులు ఉండే అవకాశం ఉంది.

చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ఇవాళ సచివాలయంలో తన చాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 18న క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. ప్రమాణస్వీకారం తర్వాత క్యాబినెట్ భేటీ కానుండటం ఇదే తొలిసారి. 19వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉంది. అదే రోజు ప్రొటెం స్పీకర్ ఎన్నిక ఉంటుంది. తర్వాత ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం కార్యక్రమం ఉంటుంది. దీనికి సంబంధించి త్వరగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బడ్జెట్ ఆమోదం కోసం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం కూడా ఉంది.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు తదితర అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుంది. దానికి సంబంధించి అసెంబ్లీ వేదికగా ముందుకు వెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నారు. తనకు అద్భుతమైన విజయం అందించిన రాష్ట్ర ప్రజలకు, తాము ఇచ్చిన హామీలు వీలైనంత త్వరగా అమలు చేసే విధంగా ముందుకెళ్తామని మంత్రులు ఇప్పటికే స్పష్టం చేశారు. దానికి సంబంధించిన అంశాలపైన కేబినెట్ లో డిస్కస్ చేసే ఛాన్స్ ఉంది.

Also Read : కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రామ్మోహన్ నాయుడు.. పౌరవిమానయాన శాఖ గురించి కీలక వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు