కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రామ్మోహన్ నాయుడు.. పౌరవిమానయాన శాఖ గురించి కీలక వ్యాఖ్యలు

ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన సెక్టార్ గా తయారు చేయడానికి మా వంతుగా చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నాం.

కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రామ్మోహన్ నాయుడు.. పౌరవిమానయాన శాఖ గురించి కీలక వ్యాఖ్యలు

Kinjarapu Rammohan Naidu : కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టారు కింజరాపు రామ్మోహన్ నాయుడు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. దేశంలో అత్యంత పిన్న వయసులో కేంద్ర కేబినెట్ లో మంత్రి పదవిని దక్కించుకున్నారు. ”సివిల్ ఏవియేషన్ కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆ భగవంతుడిని, మా నాన్న ఎర్రన్నాయుడిని స్మరించుకుంటూ బాధ్యతలు తీసుకున్నా.

ఇవాళ నాకీ బాధ్యత వర్తించిందంటే.. దానికి కారణం మా అధినాయకుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. బాబుగారికి, లోకేశ్, పవన్ కల్యాణ్ గారికి, శ్రీకాకుళం జిల్లా ప్రజలకు, తెలుగు ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. దాంతోపాటు మా నాయకుడు చంద్రబాబు నాకు కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఇస్తే, సివిల్ ఏవియేషన్ శాఖ నాకు అప్పజెప్పిన మా టీమ్ లీడర్.. దేశ ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు.

దేశానికి సంబంధించి అతి ముఖ్యమైన మినిస్ట్రీ సివిల్ ఏవియేషన్. దేశం, ప్రపంచంలో అత్యధికంగా అభివృద్ధి సాధిస్తున్న మినిస్ట్రీ సివిల్ ఏవియేషన్ శాఖ. ఇవాళ కేబినెట్ లో అత్యంత చిన్న వయసున్న వ్యక్తిని నేనే. అటువంటి వ్యక్తి మీద ఇంత పెద్ద బాధ్యత పెట్టారంటే.. ప్రధాని మోదీ యువతకు బాధ్యత ఇస్తే సక్రమంగా చేస్తారు, యాక్టివ్ గా, ఎనర్జిటిక్ గా ముందుకు నడిపిస్తారు అనే ఆలోచనతో ఇవాళ నా మీద ఈ బాధ్యత పెట్టారు. ఆ బాధ్యతకు సంపూర్ణమైన న్యాయం చేస్తానని మోదీ, చంద్రబాబు, దేశ ప్రజానీకానికి తెలియజేస్తున్నారు.

ప్రతీ డిపార్ట్ మెంట్ లో దేశానికి సంబంధించి 100 రోజుల యాక్షన్ ప్లాన్ చేయాలని చెప్పారు. మా డిపార్ట్ మెంట్ లోనూ అది చేస్తాం. 100 డేస్ ప్లాన్ చేసి అమలు చేయడానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటాం. అలాగే 100 డేస్ ప్లాన్ నుంచి 100 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ వరకు 2047వ సంవత్సరం వరకు కూడా ఈ సివిల్ ఏవియేషన్ డిపార్ట్ మెంట్ లో ఏయే కార్యక్రమాలు చేయాలి? అనేదానిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి.. ఈ ఐదేళ్లు కూడా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో బలమైన పునాదులు, ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన సెక్టార్ గా తయారు చేయడానికి మా వంతుగా చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నాం” అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.

Also Read : ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఎవరు? రేసులో చాలామంది టీడీపీ సీనియర్ నేతలు