జగన్ ఘోర ఓటమికి, చంద్రబాబు ఘన విజయానికి ప్రధాన కారణాలివే- మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రపద్రేశ్ చరిత్రలో ఇన్ని సీట్లు ఎవరికీ లేదు. 151 అన్నది ఒక్క హిస్టరీ.

Jd Lakshmi Narayana : ఏపీలో జగన్ ఓటమికి కారణాలు ఏంటి? కూటమి ఘన విజయానికి రీజన్ ఏంటి? సంక్షేమ పథకాలతో ఓట్లు రాలవా? ప్రజలు కోరుకున్నది ఏంటి? పాలకులు ఇస్తున్నది ఏంటి? జాతీయ స్థాయి ఫలితాలు సూచిస్తున్న ట్రెండ్ ఏంటి? జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అనాలసిస్..

వైసీపీ ఘోర పరాజయానికి మొదటి కారణం ప్రభుత్వ ఉద్యోగి..
అధికారం అన్నది కర్పషన్ కు దారితీస్తుంది. అధికారం ఎక్కువైనా కర్పషన్ అన్నది ఇంకా ఎక్కువ అవుతుంది. ఆంధ్రపద్రేశ్ చరిత్రలో ఇన్ని సీట్లు ఎవరికీ లేదు. 151 అన్నది ఒక్క హిస్టరీ. ప్రభుత్వం ఎలా నడుస్తోంది అని చెప్పేవాడు ప్రభుత్వంలో పని చేసే ఉద్యోగి. జగన్ ప్రచారం చేస్తున్న సమయంలో.. సీపీఎస్, ఓపీఎస్ అన్నది ఓల్డ్ పెన్షన్ స్కీమ్.. వారం రోజుల్లో దీన్ని సాల్వ్ చేస్తా అని అన్నారు. కానీ, ఐదేళ్ల పాలనలో ఎలాంటి పరిష్కారం చూపలేదు. ఆ తర్వాత ఎన్నికలకు పోయే సమయంలో అంగన్ వాడీలు, ఆశావర్కర్ల మీద ఏ విధంగా ప్రభుత్వం వ్యవహరించింది అన్నది అందరూ చూశారు. వైసీపీ ఓటమికి ఇదొక ప్రధానమైన కారణం. ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో.. వాళ్లు ప్రభుత్వంపై తమకున్న అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తారు.

రెండో కారణం.. విధ్వంసం, అహంకార ప్రవర్తన..!
సీఎంగా అధికార పగ్గాలు తీసుకున్న వెంటనే.. ప్రజావేదికను కూల్చేశారు. అక్కడి నుంచి విధ్వంసం మొదలైంది. రిషికొండపై ఏ విధంగా నిర్మాణాలు చేశారో అందరికీ తెలుసు. ఇసుక, మైనింగ్, ప్రకృతికి ఏ విధమైన విధ్వంసం కలగజేశారో ప్రజలంతా చూశారు.

ఎమ్మెల్యేల ప్రవర్తన.. నోటి దురుసు..
ఎమ్మెల్యేల ప్రవర్తన.. నోటి దురుసు, వాళ్లు వాడిన మాటలు, అసెంబ్లీ లాంటి పవిత్రమైన స్థలంలో మనుషులను కించపరుస్తూ, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుని, ఆయన కుటుంబం గురించి చేసిన వ్యాఖ్యలు.. ఇవన్నీ కూడా కచ్చితంగా ప్రజల మీద ప్రభావం చూపించాయి.

కూటమి ఏర్పాటు..
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడటం కలిసొచ్చింది.. కూటమిని సంఘటిత శక్తిగా చేసి ఎలాగైనా ప్రభుత్వాన్ని గద్దె దించాలి అని మూడు పార్టీలు ఏ విధంగా ముందుకు వెళ్లాయో అందరూ చూశాం.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రమాదకరమైన అంశంగా మారింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మన భూములకు సర్వే చేయించి ఆ సర్వేలో వేసే రాళ్లపై ముఖ్యమంత్రి బొమ్మ ఉంటుంది అన్నది ఒకటి. పట్టాదారు పాసు పుస్తకంపై ముఖ్యమంత్రి బొమ్మ ఉండటం.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఏ విధమైన ప్రమాదం జరుగుతుంది అనేదానిపై ప్రచారం చేశారు.

వాలంటీర్ వ్యవస్థ..
వాలంటీర్ వ్యవస్థ.. వైసీపీ కార్డన్. ఎమ్మెల్యేలకు, ముఖ్యమంత్రికి ఉన్న టిక్ తొలగిపోయింది. ఏ పని కావాలన్నా వాలంటీర్. వాలంటీర వ్యవస్థ ఎంత ప్రబలంగా ప్రజల్లోకి వెళ్లిపోయిందంటే.. ముఖ్యమంత్రి, వాలంటీర్లు తప్ప మిగతా ఎవరూ రాలేదు. దాంతో వైసీపీ కేడర్ లో కూడా అసంతృప్తి నెలకొంది. కొంతమంది వాలంటీర్స్ ప్రవర్తన ప్రజలకు కోపం తెప్పించింది.

రహదారుల దుస్థితి..
రాష్ట్రంలో రహదారులు చాలా అధ్వాన్న పరిస్థితిలో ఉన్నాయి. రోడ్ల దుస్థితి గురించి మొదటి నుంచి చెబుతున్నా… అది చేయకూడదు.. అని మంకుపట్టు పట్టడం ప్రజల ఆగ్రహానికి కారణమైంది.

సంక్షేమం చేస్తే సరిపోదు..
సంక్షేమం చేస్తే చాలు.. ప్రజలు మమ్మల్ని ఎన్నుకుంటారు అనే ధోరణి దెబ్బతీసింది. అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదు. కేవలం సంక్షేమం, సంక్షేమం, పథకాలు చేస్తే చాలు అనుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన సమయంలో ఈ ఓటర్లు మా ఓటర్లు కాదు అన్న స్థాయికి వైసీపీ నాయకులు వెళ్లిపోయారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తే చాలు ఎవరైనా అధికారంలోకి వస్తారని అనుకున్నారు. కానీ, అది నిజం కాదని ప్రజలు చూపించారు. ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి దేశం మొత్తానికి ఒక కీలక సందేశం పంపింది. కేవలం సంక్షేమం మీదే ఆధారపడితే ప్రభుత్వాలు ఎంపిక కాబడవు. అందువల్ల ఈసారి వైసీపీ గెలిచి ఉంటే మిగతా రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు కూడా ఇక సంక్షేమం చేస్తే చాలు అన్న ధోరణికి వచ్చే వాళ్లేమో. దేశాన్ని మేలుకొల్పడానికి ఏపీ ప్రజలు ఇచ్చిన తీర్పు అనుకోవచ్చు.

చంద్రబాబు అరెస్ట్, కేసులు..
చంద్రబాబు అరెస్ట్, రింగ్ రోడ్ అలైన్ మెంట్, కేసులు.. ఏ విధంగా కక్ష సాధింపు ధోరణితో ప్రభుత్వం వెళ్లిందో ప్రజలంతా చూశారు.. చంద్రబాబు పట్ల సానుభూతి పెంచడానికి అదొక కారణం.

అనేక మంది అధికారులు హైకోర్టు ద్వారా పిలిపించబడే వారు. ఇది ఫాలో అవ్వలేదు, అది ఫాలో అవ్వలేదు అని కోర్టులు ప్రశ్నించాయి. ప్రజలకు ఎక్కువసార్లు లిటిగేషన్ వేయాల్సిన సందర్భాలు పెరిగిపోయాయి. ప్రభుత్వం విధి విధానాలు పాటించకుండా వాళ్లు ఒక ధోరణిలో వెళ్తుండటం వల్ల ప్రజలకు న్యాయస్థానాలకు వెళ్లాల్సిన అవసరం వచ్చింది.

మూడు రాజధానులు అంటూ విచిత్రమైన నినాదంతో ముందుకెళ్లడం, అమరావతి రైతులతో ప్రవర్తించిన తీరు, పోలీస్ స్టేషన్ కు వెళితే న్యాయం జరుగుతుందా? అసలు ఫిర్యాదు ఇవ్వడానికే భయపడే స్థాయికి ప్రజలు వెళ్లారు.. ఇవన్నీ కూడా వైసీపీ ఘోర పరాజయానికి.. కూటమి ఘన విజయానికి కారణాలుగా చెప్పొచ్చు.

కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే మన రాష్ట్రంలో అనుకూలమైన ప్రభుత్వం ఉంటే బాగుంటుంది అని ప్రజలు ఆలోచించారు. జనసేనాని పవన్ కల్యాణ్ పోరాటం.. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూటమి విజయానికి, వైసీపీ ఓటమికి కారణం అయ్యాయని నేను అనుకుంటున్నా” అని లక్ష్మీనారాయణ విశ్లేషించారు.

Also Read : వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణమిదే- ఏపీ ఎన్నికల ఫలితాలపై జేపీ సంచలన వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు