Commercial Cylinder Supply : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కమర్షియల్ గ్యాస్ కనెక్షన్ ఉన్న వారికి భారీ ఊరట.. వారందరికీ 5 కేజీల సిలిండర్లు ఫ్రీ
Commercial Cylinder Supply : ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలోని హోటళ్లు, రెస్టారెంట్లతో పాటు వలస కూలీలకు భారీ ఊరట లభించనుంది.
central govt increase Commercial Cylinder supply implemented from march 23 andhra pradesh quota details
Commercial Cylinder Supply : ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం, గల్ఫ్ దేశాలపై ఇరాన్ వరుస దాడులు.. ప్రపంచ దేశాల మీద చాలా వరకు ప్రభావం చూపుతున్నాయి. మరీ ముఖ్యంగా మన దేశంలో గ్యాస్ సరఫరా మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశంలో గ్యాస్ బండ దొరక్క ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మరీ ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వాటిని మూసి వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
వాణిజ్య సిలిండర్లను ఎక్కువగా పంపిణీ చేయడంపై దృష్టి సారించింది. అందులో భాగంగా రాష్ట్రాలకు అదనంగా 20 శాతం కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను కేటాయించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మార్చి 23, సోమవారం నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా నేడు ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. ఏపీలో దాదాపుగా 12 లక్షల పైగా కమర్షియల్ గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్రం ప్రకటించిన 20 శాతం అదనపు కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లకి గ్యాస్ సిలిండర్ల పంపిణీ ప్రారంభం కానుంది. అంటే రాష్ట్రంలో ఈ రెండు మూడు రోజుల్లో దాదాపుగా రెండున్నర లక్షల కమర్షియల్ సిలిండర్లను గ్యాస్ కంపెనీలు డెలివరీ చేయనున్నాయి.
దీంతో పాటు వలస కూలీలకు ఐదు కేజీల సిలిండర్లు ఉచితంగా ఇచ్చేందుకు రాష్ట్ర సివిల్ సప్లై శాఖ ఏర్పాట్లు చేస్తోంది. కేంద్రం నిర్ణయంతో రాష్ట్రంలోని హోటళ్లు, రెస్టారెంట్ల కోసం 19 కేజీల కమర్షియల్ సిలిండర్ల లభ్యత మరింత పెరగనుంది.
