Constables protest at Visakhapatnam Central Jail
Constables Protest : విశాఖపట్నంలోని సెంట్రల్ జైలు దగ్గర కానిస్టేబుల్స్ ఆందోళనకు దిగారు. తమను జైలు సూపరిటెండెంట్ అవమానించారంటూ భార్యా పిల్లలతో కలిసి ధర్నా చేపట్టారు. ఖైదీల ముందు కానిస్టేబుల్స్ బట్టలు విప్పించి అవమానపరిచారని నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
Read Also : రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎంపికపై బీజేపీ అధిష్టానం క్లారిటీ? వీరిద్దరిలో పార్టీ పగ్గాలు దక్కేదెవరికి?
సెంట్రజైల్ సిబ్బంది కానిస్టేబుల్స్ విధులకు హాజరు కాకుండా నిరసన వ్యక్తం చేస్తున్నారు. జైలులో విధులు నిర్వరించే తమ భర్తలకు సెంట్రల్ జైలు ఉన్నతాధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
సెంట్రల్ జైల్లో విధుల్లోకి వెళ్తున్న పోలీసు సిబ్బందిపై పై అధికారులు క్రూరంగా వ్యవహరిస్తున్నారని కానిస్టేబుల్స్ ఆరోపించారు. జైల్లో ఖైదీల ముందే బట్టలు విప్పించి తనిఖీలు చేయించడంపై కానిస్టేబుల్స్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖైదీల ముందే కానిస్టేబుళ్లను అవమానపరిస్తే వారికి ఎలా గౌరవం ఉంటుందని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఖైదీల ముందే నగ్నంగా నిలుచోబెట్టడం సరికాదని మండిపడుతున్నారు.
Read Also : ఫ్యాన్స్‌పై పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేసిన వేళ.. “ఓజీ” సినిమాపై డీవీవీ మూవీస్ కీలక కామెంట్స్