ఫ్యాన్స్‌పై పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేసిన వేళ.. “ఓజీ” సినిమాపై డీవీవీ మూవీస్ కీలక కామెంట్స్‌

పవన్ రాజకీయ సభలకు వెళ్లినప్పుడు.. ఫ్యాన్స్‌ కొందరు సమయం, సందర్భం లేకుండా ఓజీ.. ఓజీ అని అరవడం, ఆయనను ఇబ్బంది పెట్టడం సరైంది కాదని పేర్కొంది.

ఫ్యాన్స్‌పై పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేసిన వేళ.. “ఓజీ” సినిమాపై డీవీవీ మూవీస్ కీలక కామెంట్స్‌

Updated On : December 28, 2024 / 10:06 PM IST

సుజీత్ డైరెక్ష‌న్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా గురించి అప్‌డేట్‌లు రాకపోవడంపై డీవీవీ మూవీస్ స్పందించింది. క‌డ‌ప ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ప్రసంగిస్తున్న సమయంలో కొంద‌రు ఫ్యాన్స్‌ ఓజీ.. ఓజీ.. అంటూ నినాదాలు చేశారు. దీంతో వారిపై పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో డీవీవీ మూవీస్‌ ఓ ప్రకటన చేస్తూ… ఈ సినిమాపై అభిమానులు చూపిస్తున్న అభిమానాన్ని తమ అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొంది. ఓజీ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిరంతరం పని చేస్తున్నామని తెలిపింది. కానీ, ఫ్యాన్స్‌ కొందరు పవన్ రాజకీయ సభలకు వెళ్లినప్పుడు.. సమయం, సందర్భం లేకుండా ఓజీ.. ఓజీ అని అరవడం, ఆయనను ఇబ్బంది పెట్టడం సరైంది కాదని పేర్కొంది.

పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంత కష్టపడుతున్నారో అందరికీ తెలుసని చెప్పింది. ఆయన స్థానాన్ని, స్థాయిని గౌరవించడం మన బాధ్యతని పేర్కొంది. ఇంకొన్ని రోజులు ఓపికగా ఉందామని, 2025 ఓజీ పండుగ వైభవంగా నిలుస్తుందని తాము గట్టిగా నమ్ముతున్నామని చెప్పింది.

పవన్ కల్యాణ్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్న ఓజీ సినిమా కోసం ఫ్యాన్స్‌ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు విడుదల తేదీని వాయిదా వేశారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఇందులో విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఆయన గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ తో పాటు శ్రియారెడ్డి, హరీశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు.

Pawan Kalyan: వైసీపీ నేతలకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. అభిమానులపై అసహనం