Karnati Rambabu : విజయవాడ దుర్గమ్మకు పవిత్ర సారె సమర్పించిన చైర్మన్ కర్నాటి రాంబాబు

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, జగన్ సంక్షేమ పథకాలు దిగ్విజయంగా కొనసాగాలని అమ్మవారిని వేడుకున్నానని తెలిపారు. దేవాలయంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు బోర్డు మీటింగ్ లో కొన్ని తీర్మానాలు చేస్తున్నామని చెప్పారు.

Vijayawada Durgamma

Vijayawada Durgamma Pavitra Sare : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు పవిత్ర సారె కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. చైర్మన్ కర్నాటి రాంబాబు దంపతులు, పాలకమండలి సభ్యులు అమ్మవారికి పవిత్ర సారె సమర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ కర్నాటి రాంబాబు మాట్లాడుతూ దుర్గమ్మకు ఆషాఢ మాసంలో సారె‌ సమర్పించడం సంతోషంగా ఉందన్నారు.

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, జగన్ సంక్షేమ పథకాలు దిగ్విజయంగా కొనసాగాలని అమ్మవారిని వేడుకున్నానని తెలిపారు. దేవాలయంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఇవాళ (గురువారం) బోర్డు మీటింగ్ లో కొన్ని తీర్మానాలు చేస్తున్నామని చెప్పారు.

Amarnath Yatra : జులై 1 నుంచి అమర్ నాథ్ యాత్ర.. భారీగా భద్రతా ఏర్పాట్లు

వచ్చే నెల(జులై) 1వ తేదీ నుంచి జులై3వ తేదీ వరకు అమ్మవారికి శాకంబరీ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.