Amarnath Yatra : జులై 1 నుంచి అమర్ నాథ్ యాత్ర.. భారీగా భద్రతా ఏర్పాట్లు
ఈ ఏడాది 3 లక్షల మంది భక్తులు మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి వస్తారని అధికారుల అంచనా. ఈ నేపథ్యంలో యాత్రికుల కోసం టెంట్లు, గూడారాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.

Amarnath Yatra
Heavy Security Arrangements : అమర్ నాథ్ యాత్ర ఎల్లుండి (శనివారం) నుంచి ప్రారంభం కానుంది. అమర్ నాథ్ యాత్రకి అధికారులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. అమర్ నాథ్ యాత్రికులు జమ్మూకు చేరుకుంటున్నారు. జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు అమర్ నాథ్ యాత్ర జరుగనుంది. దక్షిణ కశ్మీర్ హిమాలయాల్లో 3,880 మీటర్ల ఎత్తులో అమర్ నాథ్ క్షేత్రం ఉంది.
ఈ ఏడాది 3 లక్షల మంది భక్తులు మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి వస్తారని అధికారుల అంచనా. ఈ నేపథ్యంలో యాత్రికుల కోసం టెంట్లు, గూడారాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. యాత్రికులకు కావాల్సిన ఆహార పదార్థాలను పౌర సరఫరాల శాఖ సిద్ధం చేసింది. యాత్ర మార్గంలో భద్రతా దళాలు మాక్ డ్రిల్ నిర్వహించారు.
అమర్ నాథ్ యాత్రకి ఐటీబీపీ దళాలు భద్రత కల్పిస్తున్నారు. యాత్ర మార్గంలో భారీగా భద్రతా బలగాలు మోహరించారు. డ్రోన్లతో నిఘా ఉంచారు. ఉగ్రదాడులు జరగవచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో భద్రతా దళాలు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు.