Chandrababu, Pawan Meeting: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. ఇరువురి భేటీలో చర్చకు వచ్చే అంశాలు ఏమిటంటే?

మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో వీరి భేటీ కొనసాగుతుంది.

Chandrababu, Pawan Meeting: మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో వీరి భేటీ కొనసాగుతుంది.  కీలక నేతల భేటీ ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. వీరి భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు, అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరు, పొత్తుల విషయంపై ప్రధానంగా వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

chandra babu: కొండల‌ను చెరువులుగా మార్చేశారు: చంద్ర‌బాబు

రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన జీవోలపై ఇరువురు అగ్రనేతలు ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఇటీవల చంద్రబాబు సభల్లో తొక్కిసలాట చోటు చేసుకొని అనేక మంది మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. చంద్రబాబు సభలకు, రోడ్ షో సమయంలో సరియైన పోలీస్ బందోబస్తు లేకపోవటం వల్లనే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని టీడీపీ ఆరోపిస్తుంది. అధికార పార్టీ నేతలు మాత్రం.. జనాన్ని ఎక్కువగా చూపించుకొనేందుకు ఇరుకు రోడ్లపై చంద్రబాబు రోడ్ షోలు నిర్వహిస్తుండటం వల్లనే అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని  విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబు సభలో వరుస తొక్కిసలాట ఘటనల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక జీవోను తెరపైకి తెచ్చింది.

Pawan Kalyan Varahi : కొత్త ఏడాదిలో వారాహికి ప్రత్యేక పూజలు.. ముహూర్తం, ప్లేస్ ఫిక్స్ చేసిన పవన్ కల్యాణ్

రాష్ట్రంలో రోడ్డు షోలు, ర్యాలీలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం జీవో 1ను అమల్లోకి తెచ్చింది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా, అధికారులు అనుమతిచ్చిన చోటనే సభలు నిర్వహించుకోవాలని ఈ జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం తీరుసుకున్న నిర్ణయాన్ని ఏపీలోని ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూడలేకనే సీఎం జగన్ ఇలా చేస్తున్నారంటూ టీడీపీ, జనసేన పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. జీవో అమల్లోకి రావడంతో చంద్రబాబు కుప్ప పర్యటనకు అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు, పవన్ భేటీ ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

 

గతంలో పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం విధితమే. ఆ సమయంలో పవన్‌తో చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ తరువాత తాజాగా మరోసారి  వీరు భేటీ కావటం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరి భేటీలో పొత్తుల అంశంపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతేకాక ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ఊహాగానాల నేపథ్యంలో వీటిపైనా చంద్రబాబు, పవన్ మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు