YCP MLA Attack On TDP MLA in Assembly : ‘ఇది శాసనసభ కాదు..కౌరవ సభ ’జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు : చంద్రబాబు ఆగ్రహం

అసెంబ్లీ సభలో టీడీపీ ఎమ్మెల్యేలపై వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన దాడినిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓ ఎమ్మెల్యేపై మరో ఎమ్మెల్యే పైగా అధికార పార్టీ ఎమ్మెల్యే దాడిచేయటం సిగ్గుచేటన్నారు. అసెంబ్లీ చరిత్రలో ఈరోజు చీకటి రోజుని..ఇటువంటి ప్రజాప్రతినిథులు ఉండే ఇది శాసనసభ కాదు కౌరవ సభ.. అంటూ వైసీపీ ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

YCP MLA Attack On TDP MLA in Assembly : అసెంబ్లీ సభలో టీడీపీ ఎమ్మెల్యేలపై వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన దాడినిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ దాడిని ఖండించారు. ఓ ఎమ్మెల్యేపై మరో ఎమ్మెల్యే పైగా అధికార పార్టీ ఎమ్మెల్యే దాడిచేయటం సిగ్గుచేటన్నారు. అసెంబ్లీ చరిత్రలో ఈరోజు చీకటి రోజు అని అన్నారు. రాష్ట్ర చరిత్రలో అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేపై దాడి ఎప్పుడూ జరగలేదని..సీఎం జగన్ ప్రోద్బలంతోనే వైసీపీ ఎమ్మెల్యేలు విచక్షణ మరచి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన ఘోర పరాజాయాన్ని తట్టుకోలేని ఇలా అసెంబ్లీలోనే జగన్ తన ఎమ్మెల్యేలతో తోటి ఎమ్మెలలపై దాడులు చేయించటానికి కూడా దిగజారారు అంటూ చంద్రబాబు ఆరోపించారు. ఇటువంటి ప్రజాప్రతినిథులు ఉండే ఇది శాసనసభ కాదు కౌరవ సభ.. అంటూ వైసీపీ ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటువంటి అనాగరిక చర్యలతో జగన్ చరిత్రహీనుడిగా మిగిలిపోతారని..చట్టసభలకు మచ్చ తెచ్చిన జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు అంటూ విమర్శించారు.

ఈరోజు (మార్చి 20,2023) ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన క్రమంలో అధికార పార్టీ తీసుకొచ్చిన జీవో నంబర్ 1ను వ్యతిరేకిస్తూ టీడీపీ ఎమ్మెల్యేను ఆందోళన వ్యక్తంచేస్తున్న క్రమంలో వైసీపీ పార్టీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే వీరాంజనేయస్వామిపై దాడి చేశారు. దీంతో స్పీకర్ పోడియం వద్ద వీరాంజనేయస్వామి కిందపడిపోయారు. అంతేకాదు టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి వద్ద ఉన్న ప్లకార్డును లాగేసుకుని ఆయన్ని నెట్టేశారు మరో వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి. దీంతో టీడీపీ నేతలు అసెంబ్లీ వేదికగా అధికారపార్టీ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తు ఆందోళనకు దిగారు. తమపై దాడికి టీడీపీ సభ్యులు ఖండిస్తుంటే మరోపక్క వైసీపీ సభ్యులు మాత్రం టీడీపీ సభ్యులే మాపై దాడి చేశారంటూ ఆరోపిస్తున్నారు. దీంతో ఎవరు ఎవరిపై దాడి చేశారో ప్రజలకు తెలియాలంటే ఫుటేజీ బయటపెట్టాలని డిమాండ్ చేశారు టీడీపీ ఎమ్మెల్యేలు.

YCP MLA Attack On TDP MLA in Assembly : అసెంబ్లీలోనే టీడీపీ ఎమ్మెల్యేపై వైసీపీ ఎమ్మెల్యే దాడి .. మరో ఎమ్మెల్యేపై అనుచిత ప్రవర్తన

అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంత అనుచితంగా వ్యవహరించినా స్పీకర్ మాత్రం అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవటంతో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తాము సభా హక్కులను..సభా నియమాలను పాటిస్తున్నా..తమపై చిన్నపాటి తీరుపై సస్పెండ్ చేసే స్పీకర్ అధికార పార్టీ నేతలు ఎంత అనుచితంగా వ్యవహరించినా ఎటువంటి చర్యలు తీసుకోవటంలేదని ఇది స్పీకర్ పక్షపాత వైఖరిని నిదర్శనమని విమర్శించారు. సాక్షాత్తు అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలపై దాడి చేయటంతో తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్న టీడీపీ నేతలు మనం ఎక్కడికి పోతున్నాం. ఇది అసెంబ్లీనా లేదా వీధి రౌడీలు కొట్టుకునే నడిరోడ్డా? అంటూ ప్రశ్నించారు.

మా ఎమ్మెల్యేలపై జరిగిన ఈ ఘటనలు బయటపెట్టాలని టీడీపీ నేత అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. అసెంబ్లీ చరిత్రలో ఇటువంటి ఘటన జరగలేదని ఇది వైసీపీ అధికారానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉమ్మడి ఏపీలో కూడా అసెంబ్లీ సభలో తీవ్ర వాదోపవాదాలు జరిగిన సందర్భంలో కూడా ఇటువంటి ఘటనలు జరగలేదని..విమర్శలు ప్రతివిమర్శలు జరిగినా ఇటువంటి ఘటనలు మాత్రం ఎప్పుడూ జరగలేదన్నారు. మ్మెల్సీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవటంతో వైసీపీ నేతలు తీవ్ర ప్రస్టేషన్ లో ఉండి ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అసెంబ్లీలో జరిగిన ఈ దాడి ఘటనకు సంబంధించిన ఫుటేజ్ ను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

 

ట్రెండింగ్ వార్తలు