Chandrababu Naidu
Chandrababu Naidu Cabinet 2024 : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మూడో ముఖ్యమంత్రిగా మరికొద్దిసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబుతోపాటు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్, మరో 23 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రివర్గంలో సగానికిపైగా కొత్తవారికి అవకాశం లభించింది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన 10మందికి మంత్రివర్గంలో చోటు లభించింది. సామాజిక వర్గాల వారీగా మంత్రి వర్గం కూర్పు చేశారు.
Also Read : Tollywood – Chandrababu : చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. గన్నవరంకు తరలివస్తున్న సినీ ప్రముఖులు..
చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గంలో బీసీలకు పెద్దపీట వేశారు. ఎస్సీ (మాల, మాదిగ), ఎస్టీ, ముస్లీ మైనార్టీ, ఆర్యవైశ్య, రెడ్డి, కమ్మ, కాపు, బీసీ (యాదవ, మత్స్యకార, తూర్పు కాపు, కొప్పుల వెలమ, గౌడ, శెట్టి బలిజ, కురబ) సామాజిక వర్గాల వారికి అవకాశం దక్కింది.
ఇదిలాఉంటే మంత్రివర్గంలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన పది మందికి అవకాశం దక్కింది. వారిలో నారా లోకేశ్, పవన్ కల్యాణ్, గుమ్మడి సంధ్యారాణి, మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, టీజీ భరత్, ఎస్.సవిత, కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్ లు ఉన్నారు.
అదేవిధంగా పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవి, బీసీ జనార్థన్ రెడ్డిలు పలుమార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి మొదటిసారి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఇదిలాఉంటే.. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పి.నారాయణ, ఎన్.ఎమ్.డి.ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్థసారధిలు గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్నవారు.
Also Read : అదిగదిగో అమరావతి.. విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న రాజధాని
సామాజిక వర్గాల వారిగా మంత్రుల జాబితా..
డోలా బాల వీరాంజనేయ స్వామి (ఎస్సీ మాల)
వంగలపూడి అనిత (ఎస్సీ మాదిగ)
గుమ్మడి సంధ్యారాణి (ఎస్టీ)
ఫరూక్ (ముస్లిం మైనారిటీ)
టీజీ భరత్ (ఆర్య వైశ్య)
ఆనం రామనారాయణ రెడ్డి (రెడ్డి),
బీసీ జనార్దన్ రెడ్డి (రెడ్డి)
మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (రెడ్డి)
నిమ్మల రామానాయుడు (కాపు)
పవన్ కల్యాణ్ (కాపు)
కందుల దుర్గేష్ (కాపు)
పొంగూరు నారాయణ (బలిజ)
నారా లోకేశ్ (కమ్మ)
నాదెండ్ల మనోహర్ (కమ్మ)
పయ్యావుల కేశవ్ (కమ్మ)
గొట్టిపాటి రవికుమార్ (కమ్మ)
కొలుసు పార్థసారథి (బీసీ, యాదవ)
సత్యకుమార్ యాదవ్ (బీసీ, యాదవ)
కొల్లు రవీంద్ర (బీసీ మత్స్యకార)
కొండపల్లి శ్రీనివాస్ (బీసీ తూర్పు కాపు)
కింజరాపు అచ్చెన్నాయుడు (బీసీ, కొప్పుల వెలమ)
అనగాని సత్యప్రసాద్ (బీసీ, గౌడ)
వాసంశెట్టి సుభాష్ (బీసీ, శెట్టిబలిజ)
ఎస్. సవిత (కురబ)