Tollywood – Chandrababu : చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. గన్నవరంకు తరలివస్తున్న సినీ ప్రముఖులు..

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి పీఎం నరేంద్ర మోదీతో సహా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ క్రమంలో సినీ ప్రముఖులు కూడా చాలా మంది హాజరవుతున్నట్టు తెలుస్తుంది.

Tollywood – Chandrababu : చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. గన్నవరంకు తరలివస్తున్న సినీ ప్రముఖులు..

Film Industry Famous Personalities Coming to Chandrababu Oath Taking Ceremony

Updated On : June 12, 2024 / 11:28 AM IST

Tollywood – Chandrababu : ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టనున్నారు. గన్నవరం వద్ద కేసరపల్లి వేదికగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఘనంగా జరగనుంది. నేడు ఉదయం 11.27 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

అయితే ఈ ప్రమాణ స్వీకారానికి పీఎం నరేంద్ర మోదీతో సహా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ క్రమంలో సినీ ప్రముఖులు కూడా చాలా మంది హాజరవుతున్నట్టు తెలుస్తుంది. ఏపీ ప్రభుత్వం చాలా మంది సినిమా వాళ్లకు కూడా ఆహ్వానం పంపినట్టు టాలీవుడ్ సమాచారం. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం కూడా ఉండటంతో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లు ఫ్యామిలితో హాజరవుతున్నారు. నాగబాబు ఎలాగూ జనసేన తరపున వస్తున్నారు. బాలకృష్ణ ఎమ్మెల్యేగా హాజరవుతున్నారు. నందమూరి ఫ్యామిలీ కూడా హాజరు కాబోతుంది. సూపర్ స్టార్ రజినీకాంత్, హీరో నిఖిల్, బోయపాటి శ్రీను, నిర్మాత అశ్వినిదత్.. మరింతమంది సినీ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది.

Also Read : Chiranjeevi : చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం

ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు గన్నవరం చేరుకున్నారు. రాజకీయ కార్యక్రమం అయినా చాలా మంది సినీ ప్రముఖులు వస్తుండటంతో ఈ కార్యక్రమం మరింత అటెన్షన్ తెచ్చుకుంది. ఆయా హీరోల అభిమానులు కూడా భారీగా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇప్పటికే గన్నవరం పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది.