Chandrababu : రిటైర్డ్ జస్టిస్ చంద్రు వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్

రిటైర్డ్ జస్టిస్ చంద్రు వ్యాఖ్యలకు టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. ఒక జడ్జి ఇక్కడకు వచ్చి రాజ్యాంగ ఉల్లంఘన అంటున్నారని తెలిపారు.

Chandrababu (2)

Chandrababu counters retired Justice Chandru : రిటైర్డ్ జస్టిస్ చంద్రు వ్యాఖ్యలకు టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. సీపీఎస్ రద్దుపై జగన్ హామీ ఏమయ్యిందని చంద్రబాబు ప్రశ్నించారు. హామీ నెరవేర్చకపోతే చెప్పుతో కొట్టండి అన్నారు….ఇప్పుడు ఏమి చెపుతారని నిలదీశారు. జగన్ ఒక దొంగ పిల్లి…కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ఎవరూ చూడడం లేదు అనుకుంటుందని విమర్శించారు. ఒక్కసారి అని ఓటు వేసిన ప్రజలు….ఇప్పుడు భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్లిపోయారని పేర్కొన్నారు.

ఒక జడ్జి ఇక్కడకు వచ్చి రాజ్యాంగ ఉల్లంఘన అంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న దారుణ పరిస్థితులు వీళ్లకు పట్టవా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కొందరు పేటీఎమ్ బ్యాచ్ లు తయారు అయ్యారని విమర్శించారు. రాష్ట్రంలో ఆత్మహత్యలు, అల్లకల్లోలం ఆ జడ్జిలకు కనపడదా అని పేర్కొన్నారు.

Omicron : హైదరాబాద్ లో ఒమిక్రాన్ బాధితుడి ఆచూకీ లభ్యం

ఒక నేరస్థుడికి ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేయవచ్చా అని ప్రశ్నించారు. ఒకాయన సుప్రీంకోర్టు జడ్జిగా పని చేశారని.. ఆయన కుమారుడుకు ఏపీలో పదవి తీసుకుని జగన్ ను పొగుడుతున్నారని ఆరోపించారు. రిటైర్ అయిన తరువాత వీళ్ళకి పదవులు కావాలి…అందుకే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.