Chandrababu Naidu: చంద్రబాబు హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అనుమతి నిరాకరణ.. హెలిప్యాడ్ మధ్యలో తవ్వకాలు

చింతలపూడి సభ వద్ద హెలిఫ్యాడ్ పై తవ్వకాలు జరపడంతో చంద్రబాబు నాయుడు రావాల్సిన హెలికాప్టర్ ల్యాండ్ అవడానికి తొలుత అధికారులు అనుమతులు మంజూరు చేయలేదు.

Helipad

TDP Chief Chandrababu Naidu : ఏపీలో రెండుమూడు నెలల్లో ఎన్నికల షెడ్యూల్ రానుంది. ఈ క్రమంలో అధికార, విపక్ష పార్టీల అధినేతలు సభలు, సమావేశాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రా కదలిరా సభలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే 17 లోక్ సభ స్థానాల పరిధిలో చంద్రబాబు సభలు నిర్వహించారు. రోజుకు రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సభలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఇటీవల కొంత విరామం తీసుకున్న చంద్రబాబు.. మళ్లీ సోమవారం నుంచి రెండ్రోజుల పాటు రా కదలిరా సభలకు హాజరు కానున్నారు. ఈ క్రమంలో సోమవారం అనకాపల్లి జిల్లా మాడుగుల, ఏలూరు జిల్లాలోని చింతలపూడిలో బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది.

Also Read : జనసేనకు సీట్ల కేటాయింపుపై బుచ్చయ్య చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు

ఏలూరు జిల్లా చింతలపూడిలో టీడీపీ అధినేత చంద్రబాబు రా కదలి రా సభలో పాల్గొనాల్సి ఉంది. సభాస్థలి వద్ద బాంబ్ స్వ్కాడ్ తనిఖీలు నిర్వహించింది. సభా స్థలి సమీపంలో ఉన్న హెలిప్యాడ్ వద్ద కూడా బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా సిగ్నల్ బజర్ మోగడంతో బాంబ్ స్క్వాడ్ అధికారులు కంగుతిన్నారు. వెంటనే హెలిప్యాడ్ మధ్యలో తవ్వకాలు జరిపారు. తవ్వకాలు జరుపుతున్న సమయంలో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమైంది. తవ్వకాల్లో ఐరన్ రాడ్ బయటపడడంతో ఒక్కసారిగా అధికారులు, టీడీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.

Also Read : జనసైనికులు కుక్క తోక పట్టుకొని గోదారి ఈదకండి: అంబటి రాంబాబు

చింతలపూడి సభ వద్ద హెలిఫ్యాడ్ పై తవ్వకాలు జరపడంతో చంద్రబాబు నాయుడు రావాల్సిన హెలికాప్టర్ ల్యాండ్ అవడానికి తొలుత అధికారులు అనుమతులు మంజూరు చేయలేదు. అనకాపల్లిలో రా కదలిరా సభను పూర్తిచేసుకొని వచ్చే సమయానికి హెలిప్యాడ్ ను సిద్ధం చేసి చంద్రబాబు హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుమతి ఇస్తామని అధికారులు తెలిపారు.