Sidharth Luthra Tweet
Sidharth Luthra Tweet : స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు తరపున వాదిస్తున్న న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. గతంలో ఓ కేసులో ప్రాథమిక విచారణ తర్వాత హైకోర్టు జడ్జి.. తీర్పును 14 నెలల తర్వాత వెలువరించారని, అయితే తీర్పు బాగా ఆలస్యమైనందుకు ఆయనే క్షమాపణ చెప్పారని తన ట్వీట్ లో ప్రస్తావించారు.
న్యాయమూర్తులు త్వరగా తీర్పులు ఇవ్వడం చాలా ముఖ్యం అని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. న్యాయపరమైన క్రమశిక్షణ, సత్వర తీర్పులు అవసరం అని లూథ్రా అభిప్రాయం వ్యక్తం చేశారు.
Also Read..AP Politics: ఏపీలో రాజకీయ కురుక్షేత్రం.. నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలే నెక్ట్స్ టార్గెట్?
కోర్టుల్లో చంద్రబాబుకి దక్కని ఊరట..
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయిన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు కేసుని లాయర్ లూథ్రా వాదిస్తున్నారు. కాగా, చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. ఇలా ఏ కోర్టులోనూ చంద్రబాబుకి రిలీఫ్ లభించలేదు. ఏసీబీ, హైకోర్టు, సుప్రీంకోర్టు.. ఇలా అన్ని చోట్ల చంద్రబాబుకి నిరాశే ఎదురైంది. ఈ క్రమంలో చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా చేసిన ట్వీట్ చర్చకు దారితీసింది.
చీకటి తర్వాత వెలుగే..
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా గతంలో చేసిన ట్వీట్లు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ప్రతీ రాత్రి తర్వాత ఉదయం వస్తుంది. ఉదయం వెలుగుని తెస్తుంది అంటూ కొన్నిరోజుల క్రితం ట్వీట్ చేశారు లూథ్రా. చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేయడం, టీడీపీ అధినేతను సీఐడీ కస్టడీ కోరడం, అందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇవ్వడం.. ఈ పరిణామాల తర్వాత సిద్ధార్ధ లూథ్రా చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.
Also Read..Gudivada Amarnath: అనకాపల్లినే అమర్‌నాథ్ మళ్లీ ఎంచుకోడానికి కారణమేంటి?
కత్తి తీసి పోరాటం చేయడమే..
గతంలోనూ లూథ్రా ఇలాంటి ట్వీటే చేశారు. ప్రపంచంలో తమకు ఎదురవుతున్న అవమానాలు, అపహాస్యాన్ని పట్టించుకోకుండా ఒక మనిషి తన విధులను తాను నిర్వర్తించాలని స్వామి వివేకానంద కొటేషన్స్ ను లూథ్రా ట్వీట్ చేశారు. అంతకుముందు కూడా గురుగోవింద్ కింగ్ వ్యాఖ్యలను కోట్ చేశారాయన. అన్ని విధాలుగా ప్రయత్నించినా న్యాయం కనుచూపు మేరలో లేదని తెలిసినప్పుడు కత్తి తీసి పోరాటం చేయడమే సరైనది అంటూ అర్థం వచ్చే కొటేషన్ ను ట్యాగ్ చేశారు లూథ్రా.