Chandrababu: వరద బాధితుల కోసం ఏపీ సీఎస్‌కు చంద్రబాబు లేఖ

వరద బాధితులకు సహాయం అందించడంలో ప్రభుత్వ విఫలమైందని.. న్యాయ విచారణకు చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ సీఎస్ సమీర్ వర్మకు లేఖ ద్వారా తమ డిమాండ్లను తెలియజేశారు...

Chandrababu: వరద బాధితుల కోసం ఏపీ సీఎస్‌కు చంద్రబాబు లేఖ

Chandrababu Naidu

Updated On : November 28, 2021 / 10:57 AM IST

Chandrababu: వరద బాధితులకు సహాయం అందించడంలో ప్రభుత్వ విఫలమైందని.. న్యాయ విచారణకు చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ సీఎస్ సమీర్ వర్మకు లేఖ ద్వారా తమ డిమాండ్లను తెలియజేశారు చంద్రబాబు.

ప్రభుత్వ అంచనాల ప్రకారం రూ. 6054 కోట్ల నష్టం వాటిల్లితే.. కేవలం రూ. 35 కోట్ల నిధులను మాత్రమే విడుదల చేసింది ప్రభుత్వం. ఇది సరైన పద్దతి కాదు. ప్రకృతి వైపరీత్యాల కోసం ఖర్చు పెట్టాల్సిన రూ. 1100 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిందని కాగ్ తప్పు పట్టింది. జాతీయ ప్రకృతి విపత్తుల నిర్వహణ నిబంధనలకు విరుద్దంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది.

ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. తిరుపతి సమీపంలోని తుమ్మలగుంట చెర్వును ఆట స్థలంగా మార్చడంతో తిరుపతి నగరాన్ని వరదలు ముంచెత్తాయి. వరదల్లో ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంపై న్యాయ విచారణ జరిపించాలి.

………………………………….: సీఎం జగన్‌కు లేఖ రాసిన సోమువీర్రాజు

కడప, చిత్తూరు, నెల్లూరు, అనంత జిల్లాల్లో వరదల కారణంగా భారీగా ప్రాణ నష్టం, ఆస్తి, పంట నష్టం సంభవించాయి. రోడ్లు, వంతెనలు, విద్యుత్ కమ్యూనికేషన్ వ్టవస్థలు దారుణంగా దెబ్బ తిన్నాయి. తుఫాను, వరద తగ్గి రోజులు దాటిపోతున్నా.. ఇప్పటికీ బాధితులకు తిండి, వసతి లేక రోడ్ల మీదే ఉండిపోయారు.

చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షలు, మిగిలిన బాధిత కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి. ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు కట్టించివ్వాలి. అని లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు.

……………………………………….. : హుస్సేన్ సాగర్ లోకి దూసుకెళ్లిన కారు