Car Accident : హుస్సేన్ సాగర్ లోకి దూసుకెళ్లిన కారు

హైదరాబాద్  నెక్లెస్  రోడ్ లోని  ఎన్టీఆర్ పార్క్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. యువకుల అత్యుత్సాహం కొంప ముంచింది. కొత్తగా కారు కొన్నలో ఫ్రెండ్స్ తో షికారుకొచ్చిన మూడ్‌, ఉత్సాహం నిమ

Car Accident : హుస్సేన్ సాగర్ లోకి దూసుకెళ్లిన కారు

Car Accident In Neckles Road

Car Accident : హైదరాబాద్  నెక్లెస్  రోడ్ లోని  ఎన్టీఆర్ పార్క్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. యువకుల అత్యుత్సాహం కొంప ముంచింది. కొత్తగా కారు కొన్నలో ఫ్రెండ్స్ తో షికారుకొచ్చిన మూడ్‌, ఉత్సాహం నిమిషాల్లో నీరుగారిపోయింది.

ఆదివారం తెల్లవారుఝూమున ఎన్టీఆర్‌ పార్కు వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి హుస్సేన్‌సాగర్‌లోకి దూసుకెళ్లింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులకు స్వల్ప గాయాలయ్యాయి.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఉన్న యువకులను బయటకుతీసి.. యశోద ఆసుపత్రికి తరలించారు.
Also Read : Tripura : ఎస్సైతో సహా ఐదుగురిని హత్య చేసిన తాపీ మేస్త్రీ
యువకులను ఖైరతాబాద్‌కు చెందిన నితిన్‌, స్పత్రిక్‌, కార్తీక్‌గా పోలీసులు గుర్తించారు. కారును నాలుగు రోజుల క్రితమే కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఖైరతాబాద్ నుంచి అఫ్జల్‌గంజ్‌లో టిఫిన్ చేయడానికి మిత్రులతో కలిసి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సకాలంలో పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.