కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు సంబరాలు.. కేక్ కట్ చేసి తినిపించిన దేవాన్ష్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడిని బీజేపీ ఏపీ ఇన్‌చార్జ్ సిద్ధార్థ్ సింగ్ ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు.

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభంజనం సృష్టించడంతో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారు. కేక్ కట్ చేసిన చంద్రబాబు నాయుడి మనవడు దేవాన్ష్ అందరికీ తినిపించాడు.

చంద్రబాబు కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఫొటోలు దిగారు. వారిలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, యువనేత నారా లోకేశ్, ఆయన భార్య బ్రాహ్మణి, తదితరులు ఉన్నారు. కాగా, కాసేపట్లో చంద్రబాబు నాయుడి ఇంటికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెళ్లనున్నారు. కూటమి ప్రభుత్వ ఏర్పాటుపై టీడీపీ, బీజేపీ, జనసేన చర్చించనున్నాయి.

చంద్రబాబుతో సిద్ధార్థ్ సింగ్ భేటీ
చంద్రబాబు నాయుడిని బీజేపీ ఏపీ ఇన్‌చార్జ్ సిద్ధార్థ్ సింగ్ ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. తమ కూటమి విజయం సాధించడంతో చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబుకి మరికొందరు నేతలు కూడా శుభాకాంక్షలు చెప్పారు.

Pawan Kalyan Wife : పవన్ గెలుపు.. వీర తిలకం పెట్టి హారతి ఇచ్చిన భార్య.. పక్కనే తనయుడు అకిరా..