Chandrababu Naidu: ఎన్డీఏను అధికారంలోకి తీసుకురావడానికి నరేంద్ర మోదీ రేయింబవళ్లు కష్టపడ్డారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్డీఏకు మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ కూటమి నేతలు తీర్మానం చేశారు. పాత పార్లమెంటు భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు.
ఎన్నికల ప్రచారం ప్రారంభం నుంచి చివరి వరకు నరేంద్ర మోదీ కష్టపడ్డారని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ లోనూ ఆయన మూడు బహిరంగ సభలు, ర్యాలీల్లో పాల్గొన్నారని చెప్పారు. మోదీ విజనరీ నాయకుడని చంద్రబాబు తెలిపారు. మోదీ నేతృత్వంలో భారత్ అభివృద్ధిలో ముందుందని అన్నారు.
దూరదృష్టి కలిగిన మోదీ, అందుకు తగ్గట్లు పనిచేస్తూ భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు తీయించారని చంద్రబాబు చెప్పారు. మోదీ నేతృత్వంలో 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంగా నిలుస్తుందని చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పటికే ఆయన నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలో ఐదో స్థానంలో ఉందని తెలిపారు. దేశానికి సరైన సమయంలో సరైన నాయకత్వం వచ్చిందని చంద్రబాబు కొనియాడారు.
Also Read: మూడోసారి ఎన్డీఏ పక్ష నేతగా మోదీ.. ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎన్డీఏ నేతలు