మూడోసారి ఎన్డీఏ పక్ష నేతగా మోదీ.. ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎన్డీఏ నేతలు

NDA Meet: ఎన్డీఏకు మద్దతిస్తున్న ఎంపీల జాబితాను రాష్ట్రపతికి..

మూడోసారి ఎన్డీఏ పక్ష నేతగా మోదీ.. ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎన్డీఏ నేతలు

Updated On : June 7, 2024 / 12:32 PM IST

ఎన్డీఏకు నరేంద్ర మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ ఆ కూటమి నేతలు ఇవాళ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఇందుకోసం పాత పార్లమెంటు భవనంలో ఎన్డీఏ ఎంపీలు సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుస్తారు. ఎన్డీఏకు మద్దతిస్తున్న ఎంపీల జాబితాను రాష్ట్రపతికి ఇచ్చి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరతారు.

ఢిల్లీలో చంద్రబాబు పర్యటన
ఇవాళ ఎన్డీఏ నేతల సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. 543 స్థానాలున్న లోక్‌సభలో ఎన్డీఏ ఈ ఎన్నికల్లో మొత్తం 293 స్థానాలను గెలుచుకుంది. బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన 272 మార్కును సాధించలేదు.

బీజేపీ ఈ సారి 240 సీట్లను మాత్రమే గెలుచుకుంది. దీంతో ఏపీలో 16 సీట్లు గెలుచుకున్న టీడీపీ కేంద్ర సర్కారులో కీలకంగా మారుతోంది. బిహార్ సీఎం నితీశ్ కుమార్‌కు చెందిన జేడీయూ (12 సీట్లు), ఏక్‌నాథ్ షిండే శివసేన (7), చిరాగ్ పాశ్వాన్‌కి చెందిన లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ (7) కూడా కేంద్ర సర్కారు ఏర్పాటులో కీలకంగా మారాయి.

Also Read: ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్‌గా నీరభ్ కుమార్ నియామకం