Pawan Kalyan: పదేళ్ల తర్వాత మళ్లీ పవన్ ఇంటికి చంద్రబాబు.. ఎందుకంటే?
పవన్ కల్యాణ్ ఇంటికి 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు వెళ్లారు. మళ్లీ వెళ్లడం ఇదే తొలిసారి. ఏపీ ఎన్నికల్లో జనసేన-టీడీపీ కలిసి
- T Venkateshwarlu
- Published On : December 17, 2023 / 09:44 PM IST
Pawan Kalyan-Chandrababu Naidu
Chandrababu Naidu: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెళ్లారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని పవన్ ఇంట్లో ఏపీ ఎన్నికల వ్యూహాలు, టీడీపీ-జనసేన సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయి. అలాగే, ఎన్నికల మ్యానిఫెస్టో రూపకల్పనపై కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read : ఎన్నికల్లో గెలుపే లక్ష్యం అంటున్న పవన్ కల్యాణ్.. నేర్చుకోవాల్సింది ఏమిటి? సరిదిద్దుకోవాల్సింది ఏమిటి?
దాదాపు పదేళ్ల తర్వాత పవన్ ఇంటికి వెళ్లారు చంద్రబాబు. 2014 ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ ఇంటికి చంద్రబాబు వెళ్లారు. మళ్లీ వెళ్లడం ఇదే తొలిసారి. ఏపీ ఎన్నికల్లో జనసేన-టీడీపీ కలిసి పోటీ చేస్తాయని ఇప్పటికే పవన్ ప్రకటించారు.
టీడీపీ-జనసేన సీట్ల సర్దుబాటుపై నేటి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో టీడీపీకి జనసేన మద్దతు ఇచ్చింది. 2019 ఎన్నికల్లో వేర్వేరుగానే పోటీ చేశాయి. ఏపీ ఎన్నికలకు మరికొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లాలా? వద్దా? అనే అంశంపైనా టీడీపీ-జనసేన క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
Also Read : ఎన్నికల ఫలితాలు ఊహకు అందవు, 160 సీట్లలో గెలుపు గ్యారెంటీ- అచ్చెన్నాయుడు సంచలనం
