Kinjarapu Atchannaidu : ఎన్నికల ఫలితాలు ఊహకు అందవు, 160 సీట్లలో గెలుపు గ్యారెంటీ- అచ్చెన్నాయుడు సంచలనం

చంద్రబాబు హయాంలో విశాఖకు తీసుకొచ్చిన సాఫ్ట్ వేర్ కంపెనీలన్నీ.. మీ దోపిడీ వల్ల, మీ ధనదాహం వల్ల వెనక్కి వెళ్ళిపోయాయి. చంద్రబాబు చేపట్టిన పనులు కంటిన్యూ చేసి ఉంటే ఈరోజుకి ఎయిర్ పోర్టు వచ్చేది. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందేది.

Kinjarapu Atchannaidu : ఎన్నికల ఫలితాలు ఊహకు అందవు, 160 సీట్లలో గెలుపు గ్యారెంటీ- అచ్చెన్నాయుడు సంచలనం

Kinjarapu Atchannaidu On TDP Win

Updated On : December 17, 2023 / 5:06 PM IST

ఏపీలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు జరిగే ఎన్నికల్లో ఫలితాలు ఊహకు అందవు అన్నారాయన. టీడీపీ 160 సీట్లలో గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అంతకుమించి వచ్చే అవకాశం కూడా లేకపోలేదన్నారు అచ్చెన్నాయుడు. టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు సభ ఏర్పాట్లపై శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో సమావేశం జరిగింది. అచ్చెన్నాయుడు, మాజీమంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా నాయకులు ఇందులో పాల్గొన్నారు.

వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు అచ్చెన్నాయుడు. వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని ఉక్కుపాదంతో అణిచి వేసిందని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఏపీ పేరు చెబితే అసహ్యించుకునే పరిస్థితిని జగన్ సర్కార్ తీసుకొచ్చిందన్నారు. రాష్ట్ర రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితిని తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలోని అభివృద్ధిని డిస్టర్బ్ చేయకుండా కొనసాగిస్తే నేడు ఏపీ అగ్రగామిగా ఉండేదన్నారు.

జగన్ కక్ష కట్టి రాష్ట్రంలో రావణకాoడను ప్రారంభించడం ఎంతవరకు సమంజసం? కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య విభేదాలు పెట్టాలని మూడు రాజధానులు అని చెప్పారు. నేటికి నాలుగున్నరేళ్లు అయింది. జగన్ ఏం సాధించారు? ఈ నాలుగున్నరేళ్ళలో నాలుగు పైసలంతైన ఉత్తరాంధ్రకు మేలు చేశారా? చంద్రబాబు గతంలో ఉత్తరాంధ్రపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. వలసల నివారణకు చర్యలు తీసుకున్నారు. ఇరిగేషన్ మొత్తం జగన్ నాశనం చేశారు. ఒక్క ప్రాజెక్టును ప్రారంభించిన పరిస్థితి లేదు.

చంద్రబాబు హయాంలో విశాఖకు తీసుకొచ్చిన సాఫ్ట్ వేర్ కంపెనీలన్నీ.. మీ దోపిడీ వల్ల, మీ ధనదాహం వల్ల వెనక్కి వెళ్ళిపోయాయి. నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. సిగ్గు లేకుండా అభివృద్ధి యాత్ర మొదలుపెట్టారు. వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో భోగాపురం ఎయిర్ పోర్టు పరిశీలనకు వెళ్లారు. పరిశీలన అంటే చంద్రబాబు వేసిన రాయి చూడటమా? చంద్రబాబు 5వేల ఎకరాలు ల్యాండ్ అక్వేర్ చేసి పనులకు టెండర్లు పిలిస్తే మీరు అధికారంలోకి వచ్చి వాటిని క్యాన్సిల్ చేసి 1000 ఎకరాలు దోచుకున్నారు.

Also Read : హైదరాబాద్‌లో ఉన్న నా ఓటును అందుకే రద్దు చేసుకున్నా.. ఇక నేను..: నాగబాబు

నాలుగేళ్ల తర్వాత భోగాపురం ఎయిర్ పోర్టు చూసేందుకు వెళ్లారు. చంద్రబాబు చేపట్టిన పనులు కంటిన్యూ చేసి ఉంటే ఈ రోజుకి ఎయిర్ పోర్టు వచ్చేది. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందేది. వంశధార ప్రాజెక్టు 84శాతం పూర్తి చేశాం. నాలుగెళ్లలో 5 శాతం కూడా మీరు పూర్తి చేయలేదు. ఇది మీ వైఫల్యమా? కాదా? భావనపాడు పోర్ట్ కి టెండర్లు పిలిస్తే దాన్ని క్యాన్సిల్ చేసి నాలుగేళ్లు గాడ నిద్రలో ఉండి ఈరోజు మీ మనుషులకు పనులు అప్పజెప్పి అట్టహాసం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉంది.

ఎప్పుడు ఎన్నికలు జరిపినా టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని అందరికీ తెలుసు. జగన్ సహా ఎమ్మెల్యేలు అందరూ అవినీతిపరులైపోయారు. కనీసం అభ్యర్థులను ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గo మారిస్తే ప్రజలు మరిచిపోతారు అనుకుంటున్నారు. చెల్లని పైసా ఎక్కడున్నా ఒకటే. ఎమ్మెల్యేలు, నాయకులు అవినీతిలో కూరుకుపోయి ప్రజలు ఛీకొట్టే పరిస్థితి వచ్చింది. అమరావతి రాజధాని విచ్ఛిన్నం చేసి నాలుగేళ్లు అయింది. ఈ నాలుగేళ్లలో ఉత్తరాంధ్రకు, రాయలసీమకు, కోస్తాంధ్రకు ఈ మేలు జరిగింది అని చెబుతూ ఒక శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము, ధైర్యం మీకుందా? విశాఖ రాజధాని అని చెప్పి 40వేల ఎకరాల భూమి దోచుకున్నావు. ఇక్కడ కంపెనీలను బయటకు పంపించి ఇక్కడ యువతకు ఉద్యోగాలు లేకుండా నష్టం చేశారు.

ఈ 20న యువగళం ముగింపు సభను భోగాపురం వద్ద న భూతో నా భవిష్యత్తు అనేలా నిర్వహిస్తున్నాం. 5 నుండి 6 లక్షల మంది జనం వస్తారని అంచనా వేస్తున్నాo. అది యువగళం ముగింపు సభ మాత్రమే కాదు 2024 ఎన్నికలకు శంఖారావ సభ కూడా. సభ విజయవంతం కాకుండా ఉండాలని అన్ని ప్రయత్నాలు ఈ ప్రభుత్వం చేస్తోంది. RTC MD వైసీపీలో పని చేస్తున్నారా? ప్రభుత్వంలో పని చేస్తున్నారా? డబ్బులు కడతాము బస్సులు ఇవ్వండి అని ఆర్టీసీ ఎండీకి లేఖ రాశాము. బస్సులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. ప్రైవేటు బస్సులు సైతం ఇవ్వకుండా ఆర్టీవోల ద్వారా వాళ్లపై ఒత్తిడి చేస్తున్నారు. నాటు బళ్ళు, సైకిళ్ళు, ట్రాక్టర్లుపైన తరలి రండి.

Also Read : జగన్ అరాచక పాలనకు మూడు నెలల్లో ముగింపు : నారా లోకేష్

ఈ దుర్మార్గుడు ఒక్కపైసా అవినీతి జరగని కేసులో అక్రమంగా అరెస్ట్ చేసి చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టారు. దానివల్ల యువగళం పాదయాత్ర ఆపారు. మళ్లీ ఇప్పుడు మొదలుపెట్టారు. 100 రోజుల్లోనే ఎన్నికలు వస్తుండటంతో విశాఖలోనే యువగళంను ముగిస్తున్నాం. వైసీపీ నుండి చాలామంది టీడీపీలో చేరేందుకు మమ్మల్ని సంప్రదిస్తున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు వస్తామంటున్నారు. ఒక్కరికి సీటు ఇవ్వండి చాలు అని అడుగుతున్నారు. రేపటి ఎన్నికల ఫలితాలు ఊహకు అందవు. టీడీపీకి 160 సీట్లు లేదా అంతకుమించి వచ్చే అవకాశం ఉంది” అని అచ్చెన్నాయుడు అన్నారు.