Naga Babu: హైదరాబాద్‌లో ఉన్న నా ఓటును అందుకే రద్దు చేసుకున్నా.. ఇక నేను..: నాగబాబు
ఆ వ్యవహారం వివాదాస్పదమవుతుందనే ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో తాను ఓటు వేయలేదని నాగబాబు తెలిపారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో..

NagaBabu
Janasena: హైదరాబాద్‌లో ఉన్న తన ఓటును రద్దు చేసుకున్నానని జనసేన నేత నాగబాబు అన్నారు. దీనికి తగిన ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు. నెల్లూరు జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. తన ఓటును ఆంధ్రప్రదేశ్ కు మార్చుకొని జనసేన-టీడీపీకి మద్దతుగా నిలుస్తానని చెప్పారు.
ఓటు విషయంలో వైసీపీ రాజకీయాలు చేస్తోందని నాగబాబు విమర్శించారు. తన భార్య, పిల్లలు, కోడలు ఓట్లు కూడా మంగళగిరిలో నమోదు చేసుకోవాలని అనుకున్నానని తెలిపారు. అందుకు సంబంధించిన దరఖాస్తులు అందజేశామని, అవి పరిశీలనలో ఉన్నాయని చెప్పారు.
ఓటు వ్యవహారం వివాదమవుతుందనే ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయలేదని నాగబాబు తెలిపారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో జనసేన పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. జనసేనను బలోపేతం చేయడమే తన లక్ష్యమని చెప్పారు. జనసేన ఆవిర్భావం తర్వాత పలుసార్లు నెల్లూరుకు వచ్చానని తెలిపారు.
రాజకీయ పదవులపై తనకు ఆసక్తి లేదని నాగబాబు చెప్పారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాఫియాకు వ్యతిరేకంగా టీడీపీ నేత సోమిరెడ్డి పోరాడుతున్నారని, ఆయనకు మద్దతు ఇస్తున్నామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితం కావాలని కోరుకుంటున్నానని తెలిపారు.
CP Srinivas Reddy: 2 నెలల్లో హైదరాబాద్‌లో వీటిని పూర్తిగా నిర్మూలించాలి: సీపీ శ్రీనివాస్ రెడ్డి