Nara Lokesh : జగన్ అరాచక పాలనకు మూడు నెలల్లో ముగింపు : నారా లోకేష్

రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతుల్ని హింసించారని విమర్శించారు. రోడ్లు, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయించాడని ఆరోపించారు.

Nara Lokesh : జగన్ అరాచక పాలనకు మూడు నెలల్లో ముగింపు : నారా లోకేష్

Nara Lokesh

Updated On : December 17, 2023 / 11:49 AM IST

Nara Lokesh – CM Jagan : సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మూడు ముక్కలాటతో ప్రజా రాజధాని అమరావతిని నాశనం చేయాలని జగన్ కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. జగన్ విధ్వంసం ఆరంభించి నాలుగేళ్లు అయిందన్నారు. వేల కోట్ల విలువైన భవనాలు శిథిలం చేశారని పేర్కొన్నారు.

రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతుల్ని హింసించారని విమర్శించారు. రోడ్లు, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయించాడని ఆరోపించారు. ఇన్ని చేసినా ప్రజా రాజధాని అమరావతిని ఇంచు కూడా కదపలేకపోయాడని తెలిపారు.

Road Accident : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ, ఐచర్ వాహనం ఢీకొని ముగ్గురు మృతి

జగన్ అరాచక పాలన మూడు నెలల్లో ముగిసిపోతుందని నారా లోకేష్ అన్నారు. రైతుల త్యాగాల పునాదులపై వెలిసిన ప్రజా రాజధాని అమరావతి అజరామరమై నిలుస్తుందని స్పష్టం చేశారు.