AP Politics: 3 గంటల పాటు వీటిపై చర్చించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్.. ఆ తర్వాత..

జనసేన పోటీ చేసే స్థానాల్లో తెలుగుదేశం ఆశావహులకు నచ్చజెప్పి వారి రాజకీయ భవిష్యత్తుకు హామీ ఇవ్వనుంది తెలుగుదేశం అధిష్ఠానం.

Chandrababu-Pawan

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య దాదాపు 3 గంటల పాటు సమావేశం జరిగింది. ఏపీలోని ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ చర్చలు జరిగాయి. తెలుగుదేశం – జనసేన పోటీ చేసే స్థానాలపై చంద్రబాబు – పవన్ స్పష్టతకు వచ్చారు.

జనసేన పోటీ చేసే స్థానాల్లో తెలుగుదేశం ఆశావహులకు నచ్చజెప్పి వారి రాజకీయ భవిష్యత్తుకు హామీ ఇవ్వనుంది తెలుగుదేశం అధిష్ఠానం. తెలుగుదేశం పోటీ చేసే స్థానాల్లో జనసేన ఆశావహులకు నచ్చజెప్పి వారి రాజకీయ భవిష్యత్తుకు హామీ ఇవ్వనున్నారు పవన్.

ఇరు పార్టీల ఆశావహులకు నచ్చజెప్పాక మంచి రోజు చూసుకుని స్థానాలను ఇరు పార్టీల అధినేతలు ప్రకటించనున్నారు. ఉమ్మడి మ్యానిఫెస్టోపైనా చంద్రబాబు, పవన్ చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే, ఉమ్మడి సభల నిర్వహణపై కూడా చర్చించినట్లు సమాచారం. చంద్రబాబు – పవన్ భేటీపై తెలుగుదేశం – జనసేన నేతల్లో ఉత్కంఠ కొనసాగింది.

సీట్ల సర్దుబాటుపై అధికారిక ప్రకటన ఎప్పుడెప్పుడా అని ఇరు పార్టీల నేతలు ఎదురు చూస్తున్నారు. అధికార వైసీపీ ఇప్పటికే జాబితాలను ప్రకటిస్తోంది. తెలుగుదేశం – జనసేన ఉమ్మడి జాబితాపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కొందరు నేతలు త్యాగాలకు సిద్ధం కావాలని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా నేతలకు ఇప్పటికే స్పష్టత ఇచ్చారు చంద్రబాబు. పొత్తులో సీటు సర్దుబాటు కాని నేతలకు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ సముచిత స్థానం కల్పిస్తానని నేతలకు స్పష్టం చేశారు.

Peddireddy Ramachandra Reddy: అందుకే వీరికి పార్టీ టికెట్ నిరాకరించింది: మంత్రి పెద్దిరెడ్డి