Cm Chandrababu Naidu
ఇక తిరుమల విషయంలో నో పాలిటిక్స్. మార్పులకే శ్రీకారం. శ్రీవారి ఆలయ పవిత్రతకే ప్రయారిటీ అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజే.. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న చంద్రబాబు..తెల్లారి ప్రెస్‌మీట్‌లో ఆసక్తికరంగా స్పందించారు. మాజీ సీఎం జగన్‌కు కౌంటర్ ఇస్తారని అనుకుంటే..పాలిటిక్స్ జోళికి వెళ్లకుండా..తిరుమల ఆలయం విషయాల వరకే పరిమితం అయ్యారు.
దాంతో చంద్రబాబు మాటల్లో అర్థం వేరే ఉందన్న చర్చ జరుగుతోంది. తన మార్క్ రాజకీయమేంటో ఆయన తిరుమల పర్యటనలో చూపించారని అంటున్నారు. నో పాలిటిక్స్ ఓన్లీ డివోషనల్ అన్నట్లుగా ప్రవర్తించారు చంద్రబాబు. నిజానికి సమయానికి తగ్గట్లుగా ..పరిస్థితులకు అనుగుణంగా ఎప్పుడు..ఎక్కడ ఎలా ప్రవర్తించాలో చంద్రబాబుకు తెలిసినంతగా మరే రాజకీయ నేతకు తెల్వదన్న అభిప్రాయాలు ఉన్నాయి.
సీఎం చంద్రబాబు కామెంట్స్‌తోనే..తిరుమల శ్రీవారి లడ్డూ ఇష్యూ పెద్ద దుమారం లేపింది. సుప్రీంకోర్టు స్వతంత్ర సిట్ ఏర్పాటుకు ఆదేశించేంత వరకు వెళ్లింది. కానీ అదే తిరుమల పర్యటనలో చంద్రబాబు ఆచితూచి మాట్లాడారు. ఎక్కడా వివాదం జోళికి వెళ్లకుండా..ఆలయం విషయంలో తాను ఏం చెప్పాలనుకున్నారో అదే చెప్పారు. మాజీ సీఎం జగన్ ప్రెస్‌మీట్ పెట్టి అంతసేపు బాబు సర్కార్ మీద విమర్శలు చేయడంతో పాటు.. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందని అటాక్ చేసినా..సీఎం చంద్రబాబు మాత్రం ఆ విషయాలపై రియాక్ట్ కాలేదు.
వివాదం ఇంతటితో ముగిసిపోవాలనా?
ఇక్కడే బాబు టైప్ పాలిటిక్స్ ఏంటో అర్థం అవుతోంది. లడ్డూ విషయంలో ఇప్పటికే వైసీపీకి జరగాల్సినంత నష్టం జరిగిపోయిందన్న చర్చ ఉంది. ఇప్పుడు కొత్తగా జరిగేది ఏం లేదు. జరగాల్సింది కూడా ఏం లేదు. ఇప్పుడు బాబు కోరుకునేదల్లా వివాదం ఇంతటితో ముగిసిపోవాలి.
సుప్రీం తీర్పుతో స్వతంత్ర సిట్ వచ్చేస్తుంది. ఏదైనా తేల్చాల్సి ఉంటే ఇండిపెండెంట్ సిట్టే నిర్ధారించాలి. అంతా అనుకున్నట్లే జరుగుతున్నప్పుడు..జగన్ కామెంట్స్ మీద రియాక్ట్ కావాల్సిన అవసరం లేదని చంద్రబాబు భావించినట్లు చర్చ జరుగుగుతోంది. పైగా కొండమీద పాలిటిక్స్ మాట్లాడొద్దని కూడా భావించి ఉండొచ్చన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఏదైనా బాబు రూటే సెపరేటని.. ఆయన రాజకీయమే వేరని అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు.
శ్రీవారి దర్శనం తర్వాత చంద్రబాబు చేసిన కామెంట్స్ కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. శ్రీవారి ఆలయ పవిత్రతకు ఎవరైనా హాని తలపెట్టాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు సీఎం చంద్రబాబు. తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తే సహించబోమని కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని తేల్చి చెప్పారు. కొండ మీద ప్రశాంతంతకు ఎక్కడా భంగం కలగకూడదని..ఏ విషయంలోనూ రాజీ పడొద్దని అధికారులకు ఆదేశించారు.
హడావుడి కనిపించకూడదని..
గతంలో ఇప్పటికీ లడ్డూ, అన్నప్రసాదం నాణ్యత పెరిగిందని భక్తులు అంటున్నారని.. ఆ క్వాలిటీ మరింత పెరగాల్సిన అవసరం అభిప్రాయ పడ్డారు. అంటే తమ హయాంలో లడ్డూ నాణ్యత ఉంటే.. వైసీపీ హయాంలో నిర్లక్ష్యం చేశారని చెప్పకనే చెప్తున్నారు సీఎం చంద్రబాబు. సేమ్‌టైమ్ ప్రముఖులు తిరుమలకు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదని కూడా స్పష్టం చేశారు చంద్రబాబు. సింపుల్‌గా, ఆధ్యాత్మిక ఉట్టిపడేలా అలంకరణ ఉండాలని..ఆర్భాటం, అనవసర వ్యయం వద్దని అధికారులకు సూచించారు ఏపీ సీఎం.
అయితే త్వరలోనే ఏపీ సర్కార్ టీటీడీ బోర్డును ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. బోర్డు ఏర్పాటు తర్వాత..కొండ మీద పెద్దఎత్తున ప్రక్షాళన చేపడుతారని అంటున్నారు. లడ్డూ క్వాలిటీ, అన్నప్రసాదం..వీఐపీ సిఫార్సు లేఖలు, పరిశుభ్రత ఇలా ప్రతీ విషయంలో పకడ్బందీ చర్యలు తీసుకుని..గతానికి ఇప్పటికి వచ్చిన మార్పు ఏంటో.. భక్తులకు కళ్లార చూపించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
దీని ద్వారా వైసీపీ హయాంలో తిరుమల క్షేత్రాన్ని పట్టించుకోలేదని..బాబు వచ్చాకే పవిత్రతకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు గత వైభవాన్ని తీసుకొచ్చారన్న చర్చ ప్రజల్లోకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా తిరుమల పర్యటనలో పాలిటిక్స్ జోళికి వెళ్లకుండా..ఆలయ పవిత్రత, భక్తులకు సౌకర్యాలు వంటి అంశాలనే ప్రస్తావించి..అంతటితో వివాదం ముగిసిసేలా చంద్రబాబు స్ట్రాటజీ ప్లే చేసినట్లు చర్చ జరుగుతోంది.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వచ్చేశాయ్.. ఆ రెండు రాష్ట్రాల్లో ఏ పార్టీ గెలుస్తుందో తెలుసా?