Ayodhya Ram Mandir
అయోధ్య రామాలయంలో శ్రీరామ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆహ్వానం అందింది. ఈ నెల 22న అయోధ్య రామజన్మభూమి దేవాలయంలో జరిగే ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా చంద్రబాబుకు శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు ఆహ్వానం పంపారు.
ఆయోధ్య రామాలయంలో శ్రీరామ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పాటు పలువురు ఏపీ నేతలకు కూడా ఆహ్వానం అందిన విషషయం తెలిసిందే. సినీనటుడు చిరంజీవికి ఆహ్వానం అందింది. అలాగే, దేశంలోని పలు రంగాల్లో రాణిస్తున్న వారికి కూడా ఆహ్వానాలు పంపారు. మొత్తం దాదాపు ఏడు వేల మందికి ఆలయ ట్రస్టు నుంచి ఆహ్వానాలు వెళ్లాయి.
అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఈ నెల 22న అయోధ్య రామమందిరంలోని రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుంది. విగ్రహ ప్రతిష్ఠకు నిన్నటి నుంచి సంప్రదాయ క్రతువులు ప్రారంభయ్యాయి.
ఇవి ఈ నెల 21వ తేదీ వరకు నిరంతరాయంగా కొనసాగుతాయి. ఈ నెల 22న మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీరాముడి విగ్రహాన్ని ప్రధాని మోదీ ప్రాణ ప్రతిష్టాపన చేస్తారు. దాదాపు 150 దేశాల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. అయోధ్యలో హోటల్ రూం ధరలు భారీగా పెరిగాయి.