హైదరాబాద్‌ నుంచి యాత్రగా అయోధ్యకు 1,265 కిలోల లడ్డు

లడ్డూను యాత్రగా రిఫ్రిజిరేటెడ్ గ్లాస్ బాక్స్‌లో పెట్టి అయోధ్యకు తీసుకెళ్తామని చెప్పారు.

హైదరాబాద్‌ నుంచి యాత్రగా అయోధ్యకు 1,265 కిలోల లడ్డు

Laddu

Ayodhya Ram Mandir: హైదరాబాద్‌లో తయారైన 1,265 కిలోల లడ్డూను ఇవాళ ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యకు తీసుకెళ్తారు. సికింద్రాబాద్, కంటోన్మెంట్‌లోని శ్రీరామ్‌ కేటరర్స్‌ ఈ లడ్డూను తయారు చేసింది. ఈ నెల 22న అయోధ్యలో రామాలయాన్ని ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే.

లడ్డూ తయారీ కోసం శ్రీరామ్‌ కేటరర్స్‌కు గతంలో జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అనుమతి లేఖ పంపింది. ఇది తమ అదృష్టంగా భావిస్తున్నామని శ్రీరామ్‌ కేటరర్స్‌ ఎండీ నాగభూషణం రెడ్డి అన్నారు. ఈ లడ్డూ తయారీని జనవరి 15న ప్రారంభించి ఇవాళ పూర్తి చేశారు. ప్రత్యేక పూజలు చేసి రోడ్డు మార్గాన ఇవాళ అయోధ్యకు తీసుకెళ్తారు.

రిఫ్రిజిరేటెడ్ గ్లాస్ బాక్స్‌లో లడ్డూను ఉంచి తీసుకెళ్తారు. కాగా, ఈ లడ్డూ తయారీ కోసం దాదాపు 30 మంది పనిచేశారని నాగభూషణం రెడ్డి తెలిపారు. తాను శ్రీరామ్‌ కేటరర్స్‌‌ను 2000 సంవత్సరం నుంచి నడుపుతున్నానని చెప్పారు.

రామ జన్మభూమి మందిర భూమిపూజ జరిగిన సమయంలోనే తమవంతుగా ఏదైనా ఇవ్వాలని అనుకున్నామని తెలిపారు. లడ్డూను యాత్రగా రిఫ్రిజిరేటెడ్ గ్లాస్ బాక్స్‌లో పెట్టి అయోధ్యకు తీసుకెళ్తామని చెప్పారు. కాగా, రామమందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తవుతున్నాయి.

Also Read: తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఇప్పుడే కొని పెట్టుకుంటే..