Chandrababu Naidu : నేను చేసిన పెద్ద తప్పు అదే.. నా వల్ల వాళ్లంతా సఫర్ అయ్యారు..

చంద్రబాబు గతంలో జరిగిన సంఘటనని గుర్తుచేస్తూ.. నా మీద అలిపిరిలో అటాక్ జరిగింది. ఆ అటాక్ అయిన తర్వాత కొన్ని రోజులకే నేను అసెంబ్లీ డిజాల్వ్ చేసి ఎలక్షన్స్ కి వెళ్ళాను. నన్ను చూసి............

Chandrababu Naidu talk about alipiri issue and assmebly dissolv issue

Chandrababu Naidu :  బాలయ్య హోస్ట్ గా ఆహాలో చేసిన అన్‌స్టాపబుల్‌ షో భారీ హిట్ అయి రికార్డులని కూడా సాధించడంతో ఈ షోకి సీజన్ 2ని కూడా ప్రకటించి గ్రాండ్ లాంచ్ చేశారు. అన్‌స్టాపబుల్‌ సీజన్ 2 లో మొదటి ఎపిసోడ్ లో అందర్నీ ఆశ్చర్యపరిచే విధంగా చంద్రబాబు, లోకేష్ ని తీసుకొచ్చారు. ఇటీవల దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా, తాజాగా నేడు ఆహాలో మొదటి ఎపిసోడ్ ని రిలీజ్ చేశారు. ఎపిసోడ్ రిలీజైన కొద్దిసేపటికే ఇది వైరల్ గా మారింది.

ఇక మొదటి ఎపిసోడ్ లో మాజీ సీఎం, బాలకృష్ణకు బావ అయిన చంద్రబాబు నాయుడుకి బాలకృష్ణ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. షోలో ఎన్నో సరదా విషయాలు, రాజకీయాలు మాట్లాడారు. మీ లైఫ్ లో చేసిన పెద్ద తప్పు ఏంటి అని బాలయ్య అడిగారు.

Chandrababu : నేను ఎమ్మెల్యేగా పోటీచేస్తా అన్నప్పుడు మా నాన్న వద్దన్నారు.. కానీ..

చంద్రబాబు గతంలో జరిగిన సంఘటనని గుర్తుచేస్తూ.. నా మీద అలిపిరిలో అటాక్ జరిగింది. ఆ అటాక్ అయిన తర్వాత కొన్ని రోజులకే నేను అసెంబ్లీ డిజాల్వ్ చేసి ఎలక్షన్స్ కి వెళ్ళాను. నన్ను చూసి వాజ్‌పేయ్, నవీన్ పట్నాయక్ మరి కొంతమంది కూడా ప్రభుత్వాలని డిజాల్వ్ చేసి ఎలక్షన్స్ కి వెళ్లారు. కానీ చాలా వరకు అందరూ ఓడిపోయారు. అప్పుడు నేను ఆ నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది అనుకున్నాను. నాకు తెలిసినంతవరకు అదే నేను చేసిన పెద్ద తప్పు అని అన్నారు.