Chandrababu : నేను ఎమ్మెల్యేగా పోటీచేస్తా అన్నప్పుడు మా నాన్న వద్దన్నారు.. కానీ..

చంద్రబాబు మాట్లాడుతూ.. జీవితంలో కొని టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వామంటే నో చెప్పాను. మా వైస్ ఛాన్సలర్ పిలిచి యూనివర్సిటీలో ఉద్యోగం ఇస్తా అన్నారు. కానీ నేను అప్పుడు ఎమ్మెల్యే గా పోటీ చేస్తా అని చెప్పాను. ఆయన గెలుస్తావా అని అడిగారు..............

Chandrababu : నేను ఎమ్మెల్యేగా పోటీచేస్తా అన్నప్పుడు మా నాన్న వద్దన్నారు.. కానీ..

Chandrababu shares about how he enter into politics

Chandrababu :  బాలయ్య హోస్ట్ గా ఆహాలో చేసిన అన్‌స్టాపబుల్‌ షో భారీ హిట్ అయి రికార్డులని కూడా సాధించడంతో ఈ షోకి సీజన్ 2ని కూడా ప్రకటించి గ్రాండ్ లాంచ్ చేశారు. అన్‌స్టాపబుల్‌ సీజన్ 2 లో మొదటి ఎపిసోడ్ లో అందర్నీ ఆశ్చర్యపరిచే విధంగా చంద్రబాబు, లోకేష్ ని తీసుకొచ్చారు. ఇటీవల దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా, తాజాగా నేడు ఆహాలో మొదటి ఎపిసోడ్ ని రిలీజ్ చేశారు. ఎపిసోడ్ రిలీజైన కొద్దిసేపటికే ఇది వైరల్ గా మారింది.

ఇక మొదటి ఎపిసోడ్ లో మాజీ సీఎం, బాలకృష్ణకు బావ అయిన చంద్రబాబు నాయుడుకి బాలకృష్ణ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. షోలో ఎన్నో సరదా విషయాలు, రాజకీయాలు మాట్లాడారు. అలాగే అసలు మొదటి సారి ఎమ్మెల్యే ఎలా అయ్యారో అడిగారు బాలయ్య.

Chandrababu : కాలేజీలో నేను చేసిన అల్లరికి.. సీఎం అయ్యాక అమెరికా వెళ్తే నా క్లాస్‌మెట్ ఓ అమ్మాయి గుర్తుపట్టింది..

చంద్రబాబు మాట్లాడుతూ.. జీవితంలో కొని టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వామంటే నో చెప్పాను. మా వైస్ ఛాన్సలర్ పిలిచి యూనివర్సిటీలో ఉద్యోగం ఇస్తా అన్నారు. కానీ నేను అప్పుడు ఎమ్మెల్యే గా పోటీ చేస్తా అని చెప్పాను. ఆయన గెలుస్తావా అని అడిగారు. ఐఏఎస్, ips కంటే రాజకీయ నాయకుడు ఎక్కువ పని చేయొచ్చు. మన కిందే వాళ్లంతా పని చేస్తారు, వాళ్ళతో పని చేయించొచ్చు అని అనుకోని రాజకీయాల్లోకి వచ్చాను. మా నాన్న దగ్గరికి వెళ్లి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అంటే వద్దు అన్నారు. ఎలాగోలా ఆయన్ని ఒప్పించి డబ్బులు అడిగితే మొదట ఇవ్వనున్నారు, చివరికి నా పట్టుదల చూసి లక్ష రూపాయలు ఇచ్చారు. నా కోసం చాలా మంది స్టూడెంట్స్ కష్టపడి ప్రచారం చేసి గెలిపించారు అని తెలిపారు.