Chandrababu : కాలేజీలో నేను చేసిన అల్లరికి.. సీఎం అయ్యాక అమెరికా వెళ్తే నా క్లాస్‌మెట్ ఓ అమ్మాయి గుర్తుపట్టింది..

చంద్రబాబు నవ్వుతూ.. మీకంటే ఎక్కువే రొమాంటిక్ పనులు చేశాము. మీరు సినిమాల్లో చేస్తే, మేము రియల్ లైఫ్ లో చేశాము. కాలేజీ రోజుల్లో మోటార్ బైక్ వేసుకొని అమ్మాయిలు కనిపిస్తే సైలెన్సర్ తీసేసి సౌండ్ పెంచేసి అల్లరి చేసేవాళ్ళం. అప్పట్లో...........

Chandrababu : కాలేజీలో నేను చేసిన అల్లరికి.. సీఎం అయ్యాక అమెరికా వెళ్తే నా క్లాస్‌మెట్ ఓ అమ్మాయి గుర్తుపట్టింది..

Chandrababu sharesh about his college days in unstoppable show

Chandrababu :  బాలయ్య హోస్ట్ గా ఆహాలో చేసిన అన్‌స్టాపబుల్‌ షో భారీ హిట్ అయి రికార్డులని కూడా సాధించడంతో ఈ షోకి సీజన్ 2ని కూడా ప్రకటించి గ్రాండ్ లాంచ్ చేశారు. అన్‌స్టాపబుల్‌ సీజన్ 2 లో మొదటి ఎపిసోడ్ లో అందర్నీ ఆశ్చర్యపరిచే విధంగా చంద్రబాబు, లోకేష్ ని తీసుకొచ్చారు. ఇటీవల దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా, తాజాగా నేడు ఆహాలో మొదటి ఎపిసోడ్ ని రిలీజ్ చేశారు. ఎపిసోడ్ రిలీజైన కొద్దిసేపటికే ఇది వైరల్ గా మారింది.

ఇక మొదటి ఎపిసోడ్ లో మాజీ సీఎం, బాలకృష్ణకు బావ అయిన చంద్రబాబు నాయుడుకి బాలకృష్ణ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. షోలో ఎన్నో సరదా విషయాలు, రాజకీయాలు మాట్లాడారు. చంద్రబాబు యూత్ గా ఉన్నప్పుడు చేసిన అల్లరి పనులు గురించి కూడా మాట్లాడారు. మీరు చేసిన రొమాంటిక్ పనులు ఏంటి అని బాలకృష్ణ చంద్రబాబుని అడిగారు.

Chandrababu : రాజశేఖర్ రెడ్డితో రాజకీయ విభేదమే తప్ప.. పర్సనల్ గా మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్..

చంద్రబాబు నవ్వుతూ.. మీకంటే ఎక్కువే రొమాంటిక్ పనులు చేశాము. మీరు సినిమాల్లో చేస్తే, మేము రియల్ లైఫ్ లో చేశాము. కాలేజీ రోజుల్లో మోటార్ బైక్ వేసుకొని అమ్మాయిలు కనిపిస్తే సైలెన్సర్ తీసేసి సౌండ్ పెంచేసి అల్లరి చేసేవాళ్ళం. అప్పట్లో బాగా అల్లరి చేశాను, ఆ ఏజ్ అలాంటిది. cm అయ్యాక ఒకసారి అమెరికా వెళ్తే నా కాలేజీ అమ్మాయి కనపడి మాట్లాడింది. అప్పుడు కాలేజీలో అలా ఉండే వాడివి అప్పుడు నిన్ను బాగా తిట్టుకున్నాం, కానీ ఇప్పుడు ఇలా సీఎం అయి చాలా గొప్ప స్టేజిలో ఉన్నావు, అసలు నువ్వు చంద్రబాబువేనా అని అడిగింది. అంతలా గుర్తుపెట్టుకుంది అంటే మనం ఏ రేంజ్ లో అల్లరి చేశామో ఆలోచించుకోండి అని అన్నారు.