Andhrapradesh : బాబు వస్తున్నాడు ! ప్రజాక్షేత్రంలో ప్రజా ఉద్యమాల కోసం రూట్ మ్యాప్ ఖరారు

రాష్ట్రంలో ఎక్కడి సమస్యలపై.. అక్కడే పోరాడాలని తెలుగుదేశం నిర్ణయించుకుంది. ప్రజాక్షేత్రంలోనే.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని టీడీపీ నేతలకు.. పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.

Chandrababu Naidu Kuppam Tour

Chandrababu Naidu: అసెంబ్లీలో శపథం తర్వాత.. టీడీపీ అధ్యక్షులు బాబు ఏం చేయబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో ఎక్కడి సమస్యలపై.. అక్కడే పోరాడాలని తెలుగుదేశం నిర్ణయించుకుంది. చంద్రబాబుతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా జనంలోనే ఉండేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ప్రజాక్షేత్రంలోనే.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని టీడీపీ నేతలకు.. పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం పార్టీ సీనియర్ నాయకులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజా ఉద్యమాల కోసం రూట్ మ్యాప్ ఖరారు చేయనున్నారు.

Read More : Andhra Pradesh : మూడు రాజధానుల రద్దుకు ఏపీ సర్కారు నిర్ణయం

2021, నవంబర్ 23వ తేదీ మంగళవారం నుంచే చంద్రబాబు జనంలోకి వెళ్తున్నారు. వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటించాలని.. బాబు డిసైడ్ అయ్యారు. మంగళవారం ఉదయం కడప జిల్లాలో.. మధ్యాహ్నం తిరుపతిలో పర్యటిస్తారు. బుధవారం .. నెల్లూరు జిల్లాలో పర్యటించి.. వరద బాధిత కుటుంబాలు, పంట నష్టపోయిన రైతులను పరామర్శిస్తారు. ఇప్పటికే.. వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితులపై.. ఆయా జిల్లాలకు చెందిన టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు చంద్రబాబు. అన్ని వివరాలు.. అడిగి తెలుసుకున్నారు.

Read More : Kishan Reddy : ఏపీ రాజధానిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్…

ఈ విపత్కర పరిస్థితుల్లో.. వరద బాధితులకు టీడీపీ శ్రేణులు అండగా నిలవాలన్నారు బాబు. వరద బాధితులకు ఆహారం, మందులు అందేలా చూడాలని చెప్పారు. చిన్న పిల్లలకు పాలు, బిస్కెట్లు అందించాలని సూచించారు. ఇప్పటికే.. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ముంపు గ్రామాల్లో సహాయచర్యలు చేపట్టడంతో పాటు.. వరదలో చిక్కుకున్న వారికి మందులు, ఆహారం అందజేసినట్లు తెలిపారు చంద్రబాబు.