Chandrababu Naidu
Chandrababu: వైసీపీ నేతలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ‘‘బాబాయిని చంపినంత సులభంగా నన్ను చంపొచ్చనుకున్నారు.. ఇప్పుడు వారు లోకేశ్ ను లక్ష్యంగా చేసుకున్నారట’’ అని అన్నారు. ఏలూరు జిల్లా విజయరాయిలో ‘ఇదేం కర్మ’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. వైసీపీకి పోలీసులు ఉంటే, తనకు ప్రజలు ఉన్నారని చెప్పారు.
బాబాయిని హత్య చేసిన వ్యక్తికి రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు ఉందా? అని ఆయన నిలదీశారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని అన్నారు. వివేకానంద మృతి కేసుపై ఆయన కూతురు సునీత సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడారని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆ కేసు తెలంగాణ రాష్ట్రానికి బదిలీ కావడం జగన్ కు చెంపదెబ్బ అని అన్నారు. పోలీసులను భయపెడుతూ జగన్ వారితో పనిచేయించుకుంటున్నారని చెప్పారు.
New Zealand vs India: మూడో వన్డే వర్షార్పణం.. 1-0 తేడాతో భారత్‌పై సిరీస్ గెలిచిన న్యూజిలాండ్
వివేకానంద మృతి కేసు నిందితుల్లో ముగ్గురు మృతి చెందారని చంద్రబాబు నాయుడు అన్నారు. దెందులూరు లండన్ బాబు శాశ్వతంగా లండన్ వెళ్తారని వ్యాఖ్యానించారు. జగన్ కు ప్రజలు మరో చాన్స్ ఇవ్వబోరని ఆయన చెప్పారు. పోలవరం నిర్వాసితులకు నేటికీ పునరావాసం లేదని ఆయన అన్నారు. గోదావరి జిల్లాలో పంట విరామం ప్రకటిస్తున్నారని, ఈ దుస్థితికి జారిపోయామని చెప్పారు.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..