TJR Sudhakar Babu : దొంగలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు ఇల్లు.. దోపిడికి కేరాఫ్ అడ్రస్ టీడీపీ : ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు

వైసీపీ పార్టీపై దగ్గుబాటి పురందేశ్వరీ చేసిన వ్యాక్యలను వెనక్కి తీసుకోవాలని అన్నారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన విభజన హామీల నిధులను వెంటనే కేంద్ర ప్రభుత్వం నుండి ఇప్పించాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.

TJR Sudhakar Babu

MLA TJR Sudhakar Babu criticized : దొంగలకు కేరాఫ్ అడ్రస్ నారా చంద్రబాబు నాయుడు ఇల్లు, దోపిడికి కేరాఫ్ టీడీపీ పార్టీ అని వైసీపీ ప్రివిలైజ్ కమిటీ సభ్యుడు, ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు విమర్శించారు. దేనికి అర్హత సాధించాడని నారా లోకేష్.. కందుకూరును ప్రకాశం జిల్లాలో కలుపుతాడని ప్రశ్నించారు.  కందుకూరును ప్రకాశం జిల్లాలో చేర్చే అంశాన్నే రెఫరెండంగా భావించి ఎన్నికలకు వెల్దామని, ప్రజా తీర్పు ఎవరివైపు ఉంటుందో చూద్దామని పేర్కొన్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎంపికైన దగ్గుబాటి పురందేశ్వరీకి స్వాగతం తెలుపుతున్నానని పేర్కొన్నారు. వైసీపీ పార్టీపై దగ్గుబాటి పురందేశ్వరీ చేసిన వ్యాక్యలను వెనక్కి తీసుకోవాలని అన్నారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన విభజన హామీల నిధులను వెంటనే కేంద్ర ప్రభుత్వం నుండి ఇప్పించాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. మూడు రాజధానులపై స్పష్టత ఉన్న వైసీపీకి మద్దతు ప్రకటించాలని కోరుతున్నామని తెలిపారు.

New Ration Cards : ఏపీ ప్రభుత్వం శుభవార్త.. కొత్తగా 1.67 లక్షల రేషన్ కార్డులు

ఆధార్ నెంబర్లను పరిశీలిస్తే వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఎంత పారదర్శంగా చేస్తుందో అర్థమవుతుందన్నారు. టీటీడీ ఛైర్మన్, సీఎం జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు రాజకీయ అరంగేట్రం చేసే విషయానికి సంబంధించి తనకు సమాచారం లేదన్నారు.

అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తాము స్వాగతిస్తామని చెప్పారు. ఆ పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే టీజేఆర్ ను వైసీపీ ప్రివిలైజ్ కమిటీ సభ్యుడిగా నియమించడంపై స్థానిక నాయకులు అభినంధనలు తెలిపారు.