మహానంది క్షేత్రంలో మరోసారి చిరుత కలకలం.. భయాందోళనలో భక్తులు

ఆలయం చుట్టుపక్కల, వెనుక భాగంలో చిరుత సంచరిస్తుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజ్ లలో రికార్డ్ అయ్యాయి.

Mahanandi Temple : మహానంది క్షేత్రంలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. దేవస్థానం పరిధిలోనే చిరుత మకాం వేసింది. వరుసగా మూడవ రోజు చిరుతపులి సంచారంతో భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు. మహానంది పుణ్యక్షేత్రంలో లొకేషన్ మార్చి, మార్చి చిరుత సంచరిస్తుంది. కామేశ్వరి దేవి సత్రం, అన్నదాన సత్రం దగ్గర చిరుత సంచారం కనిపించింది. ఆలయం పరిసర ప్రాంతాలలో చిరుత తిరుగుతున్నా అటవీ అధికారులు పట్టించుకోవటం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : ఇంద్రకీలాద్రి పై తొలిసారి వారాహి ఉత్సవాలు.. ఎప్పటి నుంచి అంటే..?

ఆలయం చుట్టుపక్కల, వెనుక భాగంలో చిరుత సంచరిస్తుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజ్ లలో రికార్డ్ అయ్యాయి. దీంతో దేవస్థానానికి రావాలంటేనే భక్తులు భయపడుతున్నారు. చిరుత భయంతో భక్తులు రాక తగ్గడంతో మహానంది పుణ్యక్షేత్రం నిర్మానుష్యంగా మారింది. పుణ్య క్షేత్రంలో చిరుత సంచరిస్తున్నప్పటికీ ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తున్నారని భక్తులు, స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహానందిలో అనేక రోజుల నుండి చిరుతపులి తిరుగుతున్నా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్న ఫారెస్ట్ అధికారుల వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read : భారత 30వ ఆర్మీచీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన జనరల్ ఉపేంద్ర ద్వివేది

 

ట్రెండింగ్ వార్తలు