ఇంద్రకీలాద్రి పై తొలిసారి వారాహి ఉత్సవాలు.. ఎప్పటి నుంచి అంటే..?

ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ అంతకంతకూ పెరుగుతుందని, సామాన్య భక్తులకు దర్శనంలో ఆటంకం కలగకూడదనే ప్రోటోకాల్ దర్శనాలు నిలిపివేశామని దుర్గగుడి ఈవో రామారావు పేర్కొన్నారు.

ఇంద్రకీలాద్రి పై తొలిసారి వారాహి ఉత్సవాలు.. ఎప్పటి నుంచి అంటే..?

Kanaka Durga Temple

Varahi festivals on Indrakiladri : జూలై 6వ తేదీ నుంచి నెలరోజుల పాటు ఇంద్రకీలాద్రిపై ఆషాఢ‌ మాస సారె మహోత్సవం నిర్వహించనున్నట్లు దుర్గగుడి ఈవో రామారావు తెలిపారు. భక్తులు అమ్మవారికి సారె సమర్పించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. జూలై 19వ తేదీ నుంచి మూడు రోజుల పాటు శాకాంబరి దేవి ఉత్సవాలు ఉంటాయని చెప్పారు. ఇంద్రకీలాద్రి పై మొట్టమొదటిసారిగా వారాహి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, ఈ ఉత్సవాలు జులై 6 నుంచి 15వరకు జరుగుతాయని దుర్గగుడి ఈవో రామారావు తెలిపారు. వారాహి ఉపాసన, హోమం, హవనం, చండీ పారాయణ, రుద్రహోమం వారాహి నవరాత్రులలో జరుపుతామని, 14న తెలంగాణా మహంకాళీ ఉత్సవ కమిటీ బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తారని చెప్పారు.

Also Read : AP Pension Scheme : ఎల్లుండి పెనుమాకలో సీఎం చంద్రబాబు స్వయంగా రూ. 7 వేల పింఛన్ల పంపిణీ..!

ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ అంతకంతకూ పెరుగుతుందని, మధ్యాహ్నం మహానివేదన సమయంలో సామాన్య భక్తులు అధిక సంఖ్యలో వేచి ఉంటున్నారని ఈవో చెప్పారు. ఆ సమయంలో ప్రోటోకాల్ దర్శనాలు ఆపాలని నిర్ణయించామని తెలిపారు. 11:45 నుంచి 12:15 వరకూ మహా నివేదన ఉంటుందని, 11:30 నుంచి 1:30 వరకు ప్రొటోకాల్ దర్శనాలు ఉండవని చెప్పారు. సామాన్య భక్తులకు దర్శనంలో ఆటంకం కలగకూడదనే ప్రోటోకాల్ దర్శనాలు నిలిపివేశామని దుర్గగుడి ఈవో రామారావు పేర్కొన్నారు.