Chegondi Hari Rama Jogaiah : జగన్ సినిమాల్లో విలన్ పాత్రకు సరిపోతారేమో : హరిరామజోగయ్య
మాట్లాడితే పవన్ కల్యాణ్ ను చంద్రబాబుకు దత్తపుత్రుడు అంటారు, ప్యాకేజీ స్టార్ అంటారు. మీరు తెలంగాణ సీఎం కేసీఆర్ కు దత్తపుత్రుడుగా 2019 ఎన్నికల్లో కొనుక్కోవటానికి కోట్లాది రూపాలయు ప్యాకేజీ తీసుకని ఏపీని తెలంగాణకు తాకట్లు పెట్టలేదా? అని అనాల్సి వస్తుంది. మీ తాత రాజారెడ్డి దగ్గరనుంచి మీ వరకు మీ కుటుంబం దోచుకోవటం, దాచుకోవటం అలవాటే కదా. కాదని చెప్పే దమ్ముందా? మీ అందరి అవినీతి చిట్టా అంతా ప్రజల ముందుకు తీసుకురమ్మంటారా?

Hari Rama Jogaiah Letter to YS Jagan
Ch Hari Rama Jogaiah Letter to YS Jagan : ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ కు సీనియర్ నేత చేగొండి హరిరామ జోగయ్య మరో లేఖ రాశారు. ఘాటు వ్యాఖ్యలతో హరిరామ జోగయ్య రాసిన లేఖలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హుందాతనంలో 10శాతం కూడా జగన్ లో లేదు అంటూ పేర్కొన్నారు. జగన్ సినిమాల్లో విలన్ పాత్రకు సరిపోతారేమో అనిపిస్తోంది. పవన్ కల్యాణ్ పెళ్లిళ్లపై జగన్ చౌకబారు విమర్శలు మానుకోవాలని సూచించారు. పవన్ ను విమర్శించటానికి మరో విషయం లేకే పెళ్లిళ్ల గురించి విమర్శిస్తున్నారా? అని ప్రశ్నించారు. జగన్ అవినీతి చిట్టా ప్రజల్లోకి తీసుకెళతాం అని పేర్కొన్నారు.
లేఖలో పేర్కొన్న విషయాలు : మీ నాన్నగారితో నాకు సన్నిహిత సంబంధం ఉండేది. మొదట్లో నేను ఆయన్ని విమర్శించినా ఆ తరువాత ఆయన అభిమానిగా మారాను. ఆయన ప్రతిపక్ష నాయకుల పట్ల చేసే విమర్శనాస్త్రాలు ఎంత హుందాగా ఉండేవో అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన హుందానంతో వ్యవహరించిన తీరులో మీరు కేవలం 10శాతం కూడా లేవనిపిస్తోంది. పవన్ కల్యాణ్ పట్ల మీరు చేసే వ్యక్తిగత విమర్శలు విన్నాక మిమ్మల్ని సినిమాల్లో విలన్ పాత్రధారిగా వర్ణించవచ్చేమోననిపిస్తోంది. చట్టపరంగా ఆయన ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటే ప్రజలకు లేని అభ్యంతరం మీకెందుకు? ఏకారణం చేతనైనా భార్యాభర్తలు చట్టపరంగా విడిపోయి చట్టపరంగానే మరో వివాహం చేసుకుంటే తప్పేంటీ? మీకు అభ్యంతరమేంటీ?పవన్ పై బురద చల్లటానికే ఇటువంటి చౌకబారు విమర్శలు చేస్తున్నారు. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది.
మాట్లాడితే చంద్రబాబుకు దత్తపుత్రుడు అంటారు, ప్యాకేజీ స్టార్ అంటారు. మీరు తెలంగాణ సీఎం కేసీఆర్ కు దత్తపుత్రుడుగా 2019 ఎన్నికల్లో కొనుక్కోవటానికి కోట్లాది రూపాలయు ప్యాకేజీ తీసుకని ఏపీని తెలంగాణకు తాకట్లు పెట్టలేదా? అని అనాల్సి వస్తుంది. మీ తాత రాజారెడ్డి దగ్గరనుంచి మీ వరకు మీ కుటుంబం దోచుకోవటం, దాచుకోవటం అలవాటే కదా. కాదని చెప్పే దమ్ముందా? మీ అందరి అవినీతి చిట్టా అంతా ప్రజల ముందుకు తీసుకురమ్మంటారా? ఇకనుంచి అయినా పవన్ పై అనవసరమైన దుర్భాషలు ఆడటం మానుకుంటే మంచిది ఒకటి అని నాలుగు అనిపించుకోవటం మీ సలహాదారు నేర్పారు మీకు..ఇలాంటి తప్పుడు మాటలు వద్దు హుందాగా వ్యవహరించండి..మీతో ఇటువంటి విమర్శలు చేయించేంది మిమ్మల్ని ముంచటానికే అని అర్థంచేసుకోండి..మీపై ఇటువంటి వ్యాఖ్యలు చేయాల్సివచ్చినందుకు మాకు బాధగా ఉంది అంటూ ఇలా పలు కీలక వ్యాఖ్యలు లేఖలో పేర్కొన్నారు చేగొండి హరిరామ జోగయ్య..
కాగా..గతంలో కూడా హరిరామజోగయ్య జగన్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే..మీమీద ఉన్న కేసుల్లోమీరు దోషిగా తేలితే మీ తరువాత సీఎం ఎవరు? పలు కీలక వ్యాఖ్యలో లేఖ రాశారు.