Harirama Jogaiah
జనసేన పార్లమెంటు అభ్యర్థుల పేరుతో కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఎంపీ హరిరామ జోగయ్య ఓ లేఖ విడుదల చేశారు. ఏడు పార్లమెంటు నియోజకవర్గాల అభ్యర్థులను సూచించారు. ఈ మేరకు పోటీ చేయించేందుకు ఆలోచించాలని పవన్ కల్యాణ్‌ను హరిరామ జోగయ్య కోరారు. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని చెప్పారు.
కాగా, ఏపీలో టీడీపీ-జనసేన తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే అభ్యర్థుల విషయంపై చంద్రబాబు-పవన్ కల్యాణ్ పలుసార్లు చర్చలు జరిపారు. అభ్యర్థుల విషయంపై పవన్ కల్యాణ్ కు హరిరామ జోగయ్య ఇంతకు ముందు కూడా పలుసార్లు లేఖలు రాశారు.
పొత్తులో భాగంగా అధిక సీట్లలో జనసేన పోటీ చేయాలని ఆయన అన్నారు. జనసేన పార్టీ చాలా నియోజక వర్గాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని ఆయన భావిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ అభ్యర్థుల జాబితాలను ప్రకటిస్తోంది. బీజేపీతో పొత్తు అంశం కొలిక్కి వచ్చాక టీడీపీ-జనసేన అభ్యర్థులను ప్రకటించనుంది.
ఎన్టీఆర్‌కు భారతరత్న ఇస్తామంటే కుటుంబ సభ్యులే వద్దన్నారు.. లక్ష్మీపార్వతి కీలక వ్యాఖ్యలు