అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తునకు సిఎం జగన్ ఆర్డర్

CBI enquiry on Antarvedhi radham: అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ రథం దగ్ధం కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ డీజీపీని ఆదేశించారు.
అంతర్వేది రథం అగ్నికి అహుతైందన్న అంశాన్ని ముఖ్యమంత్రి సీరియస్‌గా ఉండటంతో, కేసు దర్యాప్తును ఏపీ పోలీసు సవాలుగా తీసుకున్నారు. అయినా కొందరు రాజకీయ నాయకులు , పార్టీలు సిబిఐకి డిమాండ్ చేయడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దోషులు ఎవరైనా కఠినంగా శిక్షించాలని నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని ప్రకటించింది.
సీబీఐ దర్యాప్తును కోరుతూ హోం శాఖకు లేఖ పంపింది. దర్యాప్తును సీబీఐకు అప్పగిస్తూ.. రేపు జీవో వెలువడనుంది