చంద్రబాబూ దమ్ముంటే రా.. నీ చరిత్ర ఏంటో నా చరిత్ర ఏంటో చర్చిద్దాం : ఎమ్మెల్యే కరణం బలరాం

చంద్రబాబుకు నిజంగా నన్ను గెలిపించే అంత సత్తాఉంటే మంగళగిరిలో లోకేశ్ ను ఎందుకు గెలిపించలేక పోయావు అంటూ కర్ణం బలరాం ప్రశ్నించారు.

MLA Karnam Balram

MLA Karnam Balram :చీరాల ఎమ్మెల్యే కర్ణం బలరాం టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. ఇంకొల్లు టీడీపీ సభలో చంద్రబాబు నాపై అసభ్య పదజాలంతో అవాకు చవాకులు పేల్చారు. దీనివెనుకాల ఎవరున్నారో అందరికీ తెలుసు. నిన్న సభపై చంద్రబాబుకు స్లిప్పులిచ్చి మాట్లాడించారు. తనను దుర్మార్గుడంటూ దూషించారు. చీరాలలో ఆయనేదో నన్ను గెలిపించినట్లు.. దుర్మార్గుడని అన్నారు. చంద్రబాబు కంటే దుర్మార్గుడిని నేను ఈ లోకంలో చూడలేదు. ఇటువంటి తుచ్చమైన నీచమైన బుద్దులు నీకున్నాయి. నీ చరిత్ర ఏంటో.. నా చరిత్ర ఏంటో చర్చిద్దాం దమ్ముంటే రా అంటూ చంద్రబాబుకు కర్ణ బలరాం సవాల్ చేశారు. చంద్రబాబు వ్యక్తిత్వం గురించి కొంతమేరకు మాత్రమే మాట్లాడుతున్నాను. లోతుగా పోదల్చుకోలేదు.. పోతే చాలా ఉన్నాయంటూ ఎమ్మెల్యే బలరాం అన్నారు.

Also Read : కుర్చీనే లేనప్పుడు ఎలా మడతపెడతారు.. లోకేశ్‌పై వైసీపీ నేతల సెటైర్లు

2019లో నిన్ను, నీ కొడుకును ఎవరోతిట్టారని ఆ దుర తీర్చుకునేందుకు నన్ను ఆనాడు చీరాలకు చంద్రబాబు పంపారు.. నా సత్తాతోనే చీరాలలో గెలిచాను. చంద్రబాబుకు నిజంగా నన్ను గెలిపించే అంత సత్తాఉంటే మంగళగిరిలో లోకేశ్ ను ఎందుకు గెలిపించలేక పోయావు అంటూ కర్ణం బలరాం ప్రశ్నించారు. 2016లో వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో కొన్నట్లు ఎలా కొన్నావు.. అప్పట్లో పార్టీకి నష్టం వస్తుందని విభేదించిన ఆయన నిర్ణయం మేరకే పోయారు. చంద్రబాబు హద్దుల్లో ఉండి మాట్లాడితే బాగుంటుంది.. ఇంకోసారి నా గురించి మాట్లాడితే ఊరుకునేది లేదంటూ కర్ణం బలరాం హెచ్చరించారు.

Also Read : Chandrababu : వైసీపీ స‌ర్కార్‌కు ఇవే చివ‌రి ఎన్నిక‌లు

నీవుచేస్తే సంసారం.. ఇతరులు చేస్తే వ్యభిచారమా? ఎన్టీఆర్ పెట్టిన పార్టీ టీడీపీ ఇప్పుడు నీకునాకు సంబంధం లేదు. పార్టీకోసం ఎంతో కష్టపడ్డ రవి, కోడెల శివప్రసాద్ విషయంలో మీరు ఏం న్యాయం చేశారు చంద్రబాబు అంటూ బలరాం ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన కొమ్ములు వచ్చాయా గత మన జీవిత చరిత్రను మరిచి పోతామా. మీ వైపు తప్పులన్నీ పెట్టుకుని మావైపు వేలుచూపి ఎంచుతారెందుకు చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. జగన్ ను చూసి ఎగతాళి చేస్తు రెచ్చగొడుతుంటే నీ గురించి ఎదుటి వారు మాట్లాడుతారు.. అందులో తప్పేముంది. డబ్బున్న వారే నీకు కావాలి.. టీడీపీకి కార్పోరేట్ సంస్కృతి ని చంద్రబాబు అలవాటు చేసి చాలా సంవత్సరాలు అయ్యింది. నీవల్ల ఎంతమంది జీవితాలు నాశనం అయ్యాయో నాకు తెలుసు చంద్రబాబు. ఆయనకు అధికారంలో లేనప్పుడు మాత్రమే కార్యకర్తలు గుర్తుకొస్తారు. అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రారు అంటూ కర్ణం బలరాం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

 

 

 

ట్రెండింగ్ వార్తలు